Unnao: గర్భిణీ మహిళ న్యాయవాది ప్రమాదశావత్తు వాగులో పడి మృతి

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లో విషాదం నెలకొంది. సఫీపూర్ కొత్వాలి ప్రాంత, బర్హాలి గ్రామానికి చెందిన దంపతులు అటారీ గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెనపై పశువులు బైక్‌కు ఎదురుగా వచ్చాయి. బైక్ అదుపుతప్పి వరద నీటిలో పడిపోయింది.

Unnao: ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లో విషాదం నెలకొంది. సఫీపూర్ కొత్వాలి ప్రాంత, బర్హాలి గ్రామానికి చెందిన దంపతులు అటారీ గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెనపై పశువులు బైక్‌కు ఎదురుగా వచ్చాయి. బైక్ అదుపుతప్పి వరద నీటిలో పడిపోయింది. ఎక్కువ నీరు రావడంతో భార్య నీటిలో మునిగి మృతి చెందింది. భర్తకు కూడా గాయాలయ్యాయి.

సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని బర్హాలీ గ్రామానికి చెందిన శుభమ్, అసివాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే అడ్వకేట్ సునీత అలియాస్ రీటాను 28 ఏప్రిల్ 2022న వివాహం చేసుకున్నారు. శుభం తన భార్యతో కలిసి ఉన్నావ్‌లోని హుస్సేన్‌నగర్ బక్కా ఖేడా గ్రామంలో ఉన్న పాఠశాలకు వచ్చాడు. సాయంత్రం ఇద్దరూ గంగాఘాట్ కొత్వాలి ప్రాంతంలోని హాజీపూర్ అవుట్‌పోస్ట్‌లోని అటారీ గ్రామంలో నివసిస్తున్న తమ అత్త ఇంటికి వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇద్దరూ బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అటారి గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గరకు రాగానే.. ఓ పశువు బైక్‌కు ఎదురుగా వచ్చింది. దాన్ని కాపాడే క్రమంలో బైక్ అదుపు తప్పి వంతెన కింద పడిపోయింది. వరద నీరు ఎక్కువగా ఉండటంతో మహిళా న్యాయవాది అందులో మునిగి మృతి చెందింది.

ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల గ్రామస్థులు స్థలానికి చేరుకున్నారు. ఎలాగోలా ఇద్దరినీ బయటకు తీశారు. మహిళా న్యాయవాది మృతిపై గంగాఘాట్ కొత్వాలి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన న్యాయవాది ఐదు నెలల గర్భిణి. ఆమె మృతితో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: GHMC : సికింద్రాబాద్ ఆల్ఫా హోట‌ల్‌ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు