Fatwa: ముస్లిం మహిళ చేసిన ఈ పనికి ఫత్వా జారీ…ఎందుకో తెలుసా..?

ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఓ ముస్లిం మహిళపై దేవబంద్ ముఫ్తీ ఫత్వా జారీ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Vinayaka Chaturthi June 2021 1200x768

Vinayaka Chaturthi June 2021 1200x768

ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఓ ముస్లిం మహిళపై దేవబంద్ ముఫ్తీ  ఫత్వా జారీ చేసింది. వినాయక చవితి సందర్భంగా అలీగఢ్ కు చెందిన ముస్లిం మహిళ రూబీ అసిఫ్ ఖాన్ తన నివాసంలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. తాను హిందువుల పండులన్నీ జరుపుకుంటానని తెలిపింది.

ఈ విషయంలో బయటకు పొక్కడంతో దేవబంద్ కు చెందిన ముఫ్తీ అర్షద్ ఫరూఖీ…రూబీఖాన్ కు ఫత్వా జారీ చేశారు. అలీగఢ్ బీజేపీ మహిళా మోర్చా మండల ఉపాధ్యక్షురాలైన రూబీఖాన్ తనపై జారీ అయిన ఫత్వాపై స్పందించారు. ఇలాంటి వాటికి తాను బయపడనని చెప్పింది. అందరూ కలిసి ముందుకు నడవాలని…ఇస్లాం కూడా అదే బోధిస్తోందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

  Last Updated: 04 Sep 2022, 10:46 AM IST