Fatwa Against Imam : రామమందిర కార్యక్రమానికి హాజరైన ఇమామ్‌కు వ్యతిరేకంగా ఫత్వా

Fatwa Against Imam : జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగిన భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (AIIO) చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి హాజరయ్యారు.

  • Written By:
  • Updated On - January 29, 2024 / 02:02 PM IST

Fatwa Against Imam : జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగిన భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (AIIO) చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి హాజరయ్యారు. ఇందుకుగానూ ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. ఈ ఫత్వాను ముఫ్తీ సాబిర్ హుస్సేనీ జారీ చేశారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన వారం రోజుల తర్వాత ఇమామ్ ఉమర్ అహ్మద్‌కు  ఈ ఫత్వా జారీ కావడం గమనార్హం.  ఇమామ్ ఇల్యాసిపై చర్య తీసుకోవాలని భారతదేశంలోని ఇతర ముస్లిం మతపెద్దలను కూడా ఈ ఫత్వాలో ముఫ్తీ సాబిర్ హుస్సేనీ కోరారు. ఈ పరిణామంపై స్పందించిన డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి.. దీన్ని సవాల్ చేస్తూ తాను మరో ఫత్వాను జారీ చేస్తానని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘నేను ముస్లిం దేశంలో నివసించడం లేదు. నాకు ఈ ఫత్వా(Fatwa Against Imam) వర్తించదు. నేను ఈ ఫత్వాను సవాల్ చేస్తాను’’ అని స్పష్టం చేశారు.  రామమందిర ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు వెళ్లి వచ్చినప్పటి నుంచి తాను తోటి ముస్లింల నుంచి నిరసనలను ఎదుర్కోవాల్సి  వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ‘‘నాకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయిన విషయాన్ని.. నన్ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు తెలియజేశాను. పలువురు ఇమామ్‌లను నేను సమావేశానికి పిలిచాను’’ అని తెలిపారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి మాట్లాడుతూ.. ‘‘ప్రేమ, మత సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేయడమే నా పని. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాప్తి చేస్తున్న ఐక్యతా సందేశం చాలా గొప్పది.  ఇది కొత్త భారతదేశం యొక్క ముఖం. మన అతిపెద్ద మతం మానవత్వం. మాకు దేశమే ఫస్ట్. ఆ తర్వాతే అన్నీ’’ అని పేర్కొన్నారు.

Also Read :Bhiksha Mukt Bharat : బిచ్చగాళ్లు లేని నగరాలు.. ‘‘భిక్షా ముక్త్ భారత్’’‌కు 30 సిటీలు

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రయివేట్ ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకుని ఉపయోగించారు. కాగా సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. అందులో భాగంగానే ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.యాంటీ డ్రోన్ సిస్టమ్ ను సొంతంగా ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలు యాంటీ డ్రోన్ సిస్టమ్ ను పరిశీలించి ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్ సిస్టమ్ అని భావించి కొనుగోలు చేశారు. వీటిని త్వరలో నే అయోధ్య రాముల వారి ఆలయం వద్ద భద్రత కు ఉపయోగిస్తామని చెబుతున్నారు.