Site icon HashtagU Telugu

Aayushi Murder Case: దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని..!

Cropped (4)

Cropped (4)

ఢిల్లీలో గత శుక్రవారం జరిగిన యువతి పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రులే కూతురిని చంపి సూట్‌కేస్‌లో ప్యాక్‌ చేసి, యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే పక్కన పడేశారు. బీసీఏ చదివే ఆయూషి చౌదరీ వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తండ్రి నితేష్‌ యాదవ్‌ ఆమెను కాల్సి చంపాడు. అనంతరం భార్య సహకారంతో హైవే పక్కన పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిద్దరిని అరెస్ట్‌ చేశారు.

ఢిల్లీకి చెందిన ఆయుషి యాదవ్‌ను ఆమె తండ్రి హత్య చేశారు. ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించి నిందితుడు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో కూతురిని హత్య చేసిన అనంతరం నిందితులు ఆమె మృతదేహాన్ని మధురలో పడేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే సర్వీస్‌ రోడ్డులో ఎర్రటి ట్రాలీ బ్యాగ్‌లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలోని పొదల్లో రక్తంతో తడిసిన బాలిక మృతదేహం కనిపించింది. దీన్ని బట్టి చూస్తే అమ్మాయిని కాల్చి చంపినట్లు అనిపించింది.

బాలికను గుర్తించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. మిస్సింగ్ రిపోర్టులను తనిఖీ చేశారు. సమీపంలోని సీసీటీవీలను పరిశీలించారు. చివరిగా పోలీసులు ఆ అమ్మాయిని ఆయుషిగా గుర్తించారు. ఆమె తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో ఉండేది. కుటుంబసభ్యులను విచారించగా.. ఇది పరువు హత్య అని తేలింది. అనంతరం ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కూతురిని కాల్చి చంపిన తండ్రే ఆ తర్వాత మృతదేహాన్ని భార్య సాయంతో సూట్‌కేస్‌లో ఉంచి మధురలోని రాయ ప్రాంతంలో విసిరేశాడు. పోలీసులు విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.