Site icon HashtagU Telugu

UP: ఫిరోజాబాద్ లో ఘోర ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన 6గురు సజీవదహనం..!!

Up Fire Accident (1)

Up Fire Accident (1)

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో మంగళవారం అర్థరాత్రి  ఘోరప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నీచర్ దుకాణంలో మంటలు అంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జస్రానాలో జరిగింది. వార్తా సంస్థ ANI ప్రకారం…అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఆరుగురు సజీవదహనం అయ్యారు. అందులో నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలం బీకర అరుపులతో భయానకపరిస్థితిని తలపించింది. 18అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో ఉన్నట్లు ఫిరోజాబాద్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు. లోపల ఇంకేవరైనా చిక్కుకుపోయారా లేదా అనేదానిపై స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం సహాయచర్యలు జరుగుతున్నట్లు తెలిపారు.

భనవం మొత్తం మంటలు వ్యాపించడంతో ప్రాణనష్టం జరిగింది. కుటుంబం కూడా అదే భవనంలో నివసిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు.