FASTag – KYC : ఇక ఆ ఫాస్టాగ్స్ పనిచేయవు.. జనవరి 31 వరకే ఛాన్స్

FASTag - KYC : కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలువరించేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - January 15, 2024 / 06:18 PM IST

FASTag – KYC : కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలువరించేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది. ఇలాంటి కేవైసీలను జనవరి 31 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా.. కేవైసీ పూర్తి చేయకపోతే జనవరి 31 తర్వాత వాటిని బ్యాంకులు డీయాక్టివేట్‌/బ్లాక్‌లిస్ట్‌ చేస్తాయని స్పష్టం చేసింది. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు యూజర్లు తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని కోరింది. కొన్నిసార్లు వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం ముందుభాగంలో పెట్టడం లేదని.. దానివల్ల టోల్‌ప్లాజాల్లో వాహనాల ఫాస్టాగ్ తనిఖీల్లో ఆలస్యం జరుగుతోందని తెలిపింది. ప్రత్యేక వాహనాల కోసం జారీ చేసిన ఫాస్టాగ్స్, కేవైసీ లేకుండా జారీ చేసిన ఫాస్టాగ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఇటీవల గుర్తించిన క్రమంలోనే ఎన్‌హెచ్ఏఐ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్ క్యాంపెయిన్ తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్ ను ఒకటికి మించి వాహనాలకు వినియోగించడం లేదా ఒకే వాహనానికి మల్టిపుల్ ఫాస్టాగ్స్ వాడడం వంటివి తగ్గించడానికి ఈ క్యాంపెయిన ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులను తప్పించుకోవాలంటే వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయాలని కోరింది. లేటెస్ట్ కేవైసీ పూర్తి చేసిన ఫాస్టాగ్స్(FASTag – KYC) మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది.ఏదైనా సహాయం కోసం సమీపంలోని టోల్ ప్లాజాలను సంప్రదించడం లేదా ఫాస్టాగ్స్ జారీ చేసిన బ్యాంకుల టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరింది.

We’re now on WhatsApp. Click to Join.

కేవైసీ ఎలా అప్డేట్ చేయాలి?

  • ఫాస్టాగ్ యూజర్లు కేవైసీ చేసుకునేందుకు ఆ  ఫాస్టాగ్‌ను జారీ చేసిన బ్యాంకులకు కేవైసీ పూర్తి చేయాలని దరఖాస్తు చేసుకోవాలి.
  • సమీపంలోని బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి ఈ పని పూర్తి చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ లో అప్డేటెడ్ వివరాలు అందించాలి.
  • దీంతో ఫాస్టాగ్ ఖాతాలో మీ సమాచారాన్ని బ్యాంక్ అప్డేట్ చేస్తుంది.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. వాలిడ్ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్స్ ఐడీ, పాన్ కార్డు, ఆధార్ తో పాటు ఎన్ఆర్ఈజీఏ జారీ చేసిన జాబ్ కార్డు సైతం ఇందుకు ఉపయోగించవచ్చు.
  • కేవైసీ డాక్యుమెంట్లతో పాటు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ ఇవ్వాలి.
  • మీ కేవైసీ అప్డేషన్ ప్రాసెస్ 7 వర్కింగ్ డేస్ లో పూర్తవుతుంది.

Also Read: Kite Man : ఒకే దారానికి 1000 పతంగులు.. కైట్ మ్యాన్ మ్యాజిక్