పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ దాడికి లష్కరే తోయిబా (LeT)కి చెందిన టాప్ కమాండర్ ఫరూఖ్ అహ్మద్ (Farooq Ahmed) ప్రధాన సూత్రధారి అని గుర్తించామని NIA వర్గాలు వెల్లడించాయి. ఫరూఖ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తలదాచుకుని ఉండగా, అక్కడి నుంచే వివిధ డిజిటల్ యాప్‌ల సహాయంతో కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలను రహస్యంగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Coffe: కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో, శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?
గత రెండేళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఫరూఖ్ అహ్మద్ పాత్ర ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పహల్గామ్ ఘటనలో కూడా ఆయన డైరెక్షన్ లోనే దాడి జరిగిందని ఆధారాలతో నిర్ధారించారు. స్థానిక యువకులను సోషల్ మీడియా, చాటింగ్ యాప్‌ల ద్వారా మాయచేసి ఉగ్రవాద మార్గంలో నడిపించడంలో అతడి పాత్ర కీలకమైంది. అతడికి ఉన్న మద్దతు నెట్‌వర్క్‌ను విడమర్చి చూసేందుకు NIA ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఇక ఫరూఖ్ అహ్మద్ ఇంటి పైనే భద్రతా దళాలు నేరుగా చర్యలకు దిగాయి. పుల్వామా జిల్లాలో ఉన్న అతడి నివాసాన్ని భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఫరూఖ్‌ను పట్టుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా, ఈ కేసులో ఉన్న ప్రతి నైపుణ్యాన్ని వినియోగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.