Farooq Abdullah : మొఘల్ పాఠ్యాంశాల తొలగింపును ఖండించిన ఫరూక్ అబ్దుల్లా

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2023 అకడమిక్ సెషన్ కోసం చరిత్ర పుస్తకాల నుండి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సిలబస్ ను తొలగించింది. దీంతోపాటు 12వ తరగతి పుస్తకాల్లో మరిన్ని మార్పులు చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పుస్తకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) శనివారం మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆ చరిత్రను ఎవ్వరూ చెరిపేయల్యేరు. […]

Published By: HashtagU Telugu Desk
Farooq Abdullah

Farooq Abdullah

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2023 అకడమిక్ సెషన్ కోసం చరిత్ర పుస్తకాల నుండి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సిలబస్ ను తొలగించింది. దీంతోపాటు 12వ తరగతి పుస్తకాల్లో మరిన్ని మార్పులు చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పుస్తకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) శనివారం మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఆ చరిత్రను ఎవ్వరూ చెరిపేయల్యేరు. ఎన్ని పుస్తకాల్లోనుంచి తొలగిస్తారు. అక్బర్, షాజహాన్, హుమాయూన్‌ జహంగీర్ లను ఎలా మర్చిపోగలరంటూ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. మొఘలులు 800 సంవత్సరాలు పాలించారు, హిందువులు, క్రైస్తవులు లేదా సిక్కులు ఎవరూ బెదిరింపులకు గురికాలేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఎర్రకోట హుమాయున్ సమాధిని ఎలా దాచిపెడుతుంది? ఇది (కేంద్రంలోని మోడీ ప్రభుత్వం) కాలికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిపినందుకు ఇంతకుముందు ఫరూక్ అబ్దుల్లా మోడీ ప్రభుత్వంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

NCERT చరిత్ర పుస్తకం నుండి మొఘలుల అధ్యాయాన్ని తొలగించడమే కాకుండా, 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకం నుండి కూడా కొన్ని భాగాలను తొలగించిందన విషయం తెలిసిందే. గత ఏడాది ప్రారంభంలో, మొఘల్ దర్బార్, ఎమర్జెన్సీ, కోల్డ్ వార్, గుజరాత్ అల్లర్లు, నక్సల్ ఉద్యమంలోని కొన్ని భాగాలను NCERT తొలగించింది. ఈ మార్పుకు సంబంధించి, నిపుణుల కమిటీ సిఫారసుల తర్వాత, కరోనా వైరస్ తర్వాత విద్యార్థులపై అధ్యయన భారాన్ని తగ్గించడానికి కొన్ని భాగాలను పుస్తకాల నుండి తొలగించినట్లు NCERT వెల్లడించింది.

  Last Updated: 08 Apr 2023, 08:06 PM IST