Site icon HashtagU Telugu

Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు

Farmers Reject Centre’s Offer.. To Resume March To Delhi Today

Farmers Reject Centre’s Offer.. To Resume March To Delhi Today

 

Chalo Delhi march: పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ దేశ రాజధాని దిశగా రైతులు ‘ఛలో ఢిల్లీ మార్చ్’ను పునఃప్రారంభించారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిమిత పంటలను 5 ఏళ్లపాటు కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ముందుగా ప్రకటించినట్టుగా బుధవారం ఉదయం నిరసన మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీ చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఢిల్లీకి వచ్చే ప్రధాన మార్గాలైన ఘాజీపూర్, టిక్రి, నోయిడా, సింగుతో పాటు కీలకమైన సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద మెటల్, సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నెల రోజులపాటు ఇది అమల్లో ఉంటుంది. ఇప్పటికే బహిరంగ సభలపై కూడా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అయితే తమ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. తమపై బలప్రయోగం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నామని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా నిరసనకు వచ్చిన రైతులు చాలా రోజులపాటు నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఆహార సామగ్రిని కూడా వారి వెంట తెచ్చుకోవడం గమనార్మం.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, పప్పుధాన్యాలు, మొక్కజొన్నలతో పాటు పత్తి పంటను కనీస మద్దతు ధరతో ఐదేళ్లపాటు పంటలను కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. కొన్ని పంటలను మాత్రమే కొనుగోలు చేస్తే ఎలాగని, మిగతా పంటలు పండించే రైతుల పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. మొత్తం 23 వాణిజ్య పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎంఎస్‌పీకి చట్టబద్ధత, చట్టపరమైన హామీల అమలు, రైతు రుణ మాఫీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులపై కేసుల ఎత్తివేత సహా పలు డిమాండ్లను రైతులు ప్రభుత్వం ముందు ఉంచారు.

మరోవైపు పోలీసులు ప్రయోగించే రబ్బర్ బుల్లెట్ల బారినపడకుండా ఉండేందుకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తెప్పించుకున్నారు రైతులు. పలువురు కర్షకులు గ్యాస్​ మాస్క్​లను కూడా ధరించారు. సిమెంట్ బారికేడ్లను బద్దలుకొట్టేందుకు వివిధ పరికరాలను తెచ్చుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు, కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

read also : RRB Technician Recruitment: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 9000 టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌