పంజాబ్ రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమైయ్యారు. గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి డిసెంబర్ 15 నుంచి 11 జిల్లాల్లో టోల్ ప్లాజాలను దిగ్బంధించనున్నట్లు ప్రకటించింది. రైతుల పోరాటాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో రైతులు నిశితంగా గమనిస్తున్నారు. చండీగఢ్‌లో పంజాబ్ వ్యవసాయ మంత్రి, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించామని.. పంజాబ్ ప్రభుత్వం తమకు MSPపై ఎప్పటికీ హామీ ఇవ్వదని.. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి చీఫ్ సర్వన్ సింగ్ పంధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, రుణమాఫీ సహా వివిధ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా స్పందించడం వల్ల ఆందోళన తీవ్రతరం చేయాలని ఆయన తెలపారు. రైతు ఆందోళనలో తలదాచుకున్న కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని.. పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు. డిసెంబర్ 15 నుండి జనవరి 15, 2023 మధ్య ఒక నెలపాటు రైతు సంఘం ఆధ్వర్యంలో టోల్ ప్లాజాలను బ్లాక్ చేస్తామని ఆయన తెలిపారు. కార్పోరేట్ సంస్థలు టోల్ ప్లాజాలను స్వాధీనం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.
Punjab : మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న పంజాబ్ రైతులు

Farmers Protest Imresizer