Omicron : ఆ 12దేశాల ప్ర‌యాణీకుల నిర్బంధం

క‌రోనా మూడో వేవ్ రూపంలో `ఓమైక్రిన్` ప్ర‌మాదాన్ని ముంద‌స్తుగా కేంద్రం గుర్తించింది. రాష్ట్రాలు జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్షించాల‌ని ఢిల్లీలో ప్ర‌ధాన మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశం తీర్మానించింది.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 03:11 PM IST

క‌రోనా మూడో వేవ్ రూపంలో `ఓమైక్రిన్` ప్ర‌మాదాన్ని ముంద‌స్తుగా కేంద్రం గుర్తించింది. రాష్ట్రాలు జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్షించాల‌ని ఢిల్లీలో ప్ర‌ధాన మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశం తీర్మానించింది. ప్ర‌స్తుతం ఓమైక్రిన్ ఆన‌వాళ్లు ఉన్న యూకేతో స‌హా 11 దేశాలు, యూర‌ప్ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల‌ను క్వారంటైన్లో ఉంచాల‌ని ఆదేశించింది. ప్ర‌మాద‌క‌ర జాబితాలో ఉన్న దేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు విమానాశ్ర‌యాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సూచించింది. నెగిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క్వారంటైన్ త‌ప్ప‌ని స‌రి చేయాల‌ని ఆదేశించింది. ఎనిమిదో రోజు మళ్లీ ప‌రీక్ష చేసి రిపోర్ట్ వ‌చ్చిన త‌రువాత మాత్రమే విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని నిర్ణ‌యించింది. ఆ మేరకు రాష్ట్రాల‌కు కేంద్ర స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను జారీ చేసింది. ప్ర‌మాద‌క‌ర జాబితాలో లేని దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల్లో 5శాతం మందిని యాదృచ్చిక ప‌ద్ద‌తిన‌ ప‌రీక్షించాల‌ని ఢిల్లీలో జ‌రిగిన అత్య‌వ‌స‌రం స‌మావేశంలో తీర్మానించారు. షెడ్యూల్ చేసిన అంత‌ర్జాతీయ వాణిజ్య విమానాల ర‌ద్దుపై పున‌రాలోచ‌న నుంచి వెనుక్క వెళ్లింది. నిబంధ‌న‌ల‌ను కేంద్ర ఆరోగ్య‌శాఖ రాష్ట్రాల‌కు తెలియ‌చేసింది. ఈనెల 15 నుంచి విమానాల‌ను పున‌ర‌ద్దురించాల‌న్న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓమైక్రిన్ సీరియ‌స్ గా ఉన్న‌ దేశాల నుండి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఐదు దశలను ఏర్పాటు చేసింది. ఆ మేర‌కు రాష్ట్రాల‌కు గైడ్ లైన్స్ ఇచ్చింది. అవి ఇలా..

* వారు చేరుకునే సమయంలో కోవిడ్ పరీక్ష కోసం నమూనాను సమర్పించాలి .బయలుదేరే ముందు లేదా కనెక్టింగ్ ఫ్లైట్‌ను తీసుకునే ముందు ఫలితం కోసం వేచి ఉండాలి.

* పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చిన ఎనిమిదో రోజున మళ్లీ పరీక్ష ఉంటుంది. రాబోయే ఏడు రోజుల పాటు వారు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించవలసి ఉంటుంది.

* ప్రయాణికులు పాజిటివ్‌గా పరీక్షించినట్లయితే, వారి నమూనాలు INSACOG ప్రయోగశాల నెట్‌వర్క్‌లో జన్యు పరీక్ష కోసం పంపబడతాయి.

* పాజిటివ్‌గా ఉన్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ సదుపాయానికి పంపాలి మరియు కాంటాక్ట్ ట్రేసింగ్‌తో సహా ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం చికిత్స చేస్తారు.
* పాజిటివ్ కేసుల పరిచయాలు సంస్థాగత లేదా హోమ్ క్వారంటైన్‌లో ఉంచబడతాయి మరియు ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పర్యవేక్షిస్తుంది.

UKతో సహా ఐరోపాలోని అన్ని దేశాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖచే “ప్రమాదంలో ఉన్నవిష‌గా గుర్తించ‌బ‌డ్డాయి. వీటితో పాటు 11 ఇతర దేశాలు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ మరియు ఇజ్రాయెల్ సీరియ‌స్ జాబితాలో ఉన్నాయ‌ని కేంద్రం గుర్తించింది.అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల గత ప్రయాణ వివరాలను సమీక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. “ప్రమాదకర దేశాల” నుండి వచ్చే ప్రయాణికులపై ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని మరియు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సానుకూల నమూనాలను వెంటనే పంపాలని కోరింది.
అత్య‌వ‌స‌ర స‌మావేశంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం విమానాల‌ను అన్నింటినీ ర‌ద్దు చేయాల‌ని కోరాడు. మ‌ధ్యప్ర‌దేశ్ సీఎం చౌహాన్ ఆ రాష్ట్రంలో జ‌రుగుతోన్న ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను జీనోమ్ వ్యాలీ కేంద్రాల‌కు పంపిస్తున్న‌ట్టు తెలిపాడు. ఓ మైక్రిన్ ప‌లు ప‌రిణామాల‌ను సంత‌రించుకుంటున్న‌ట్టు ఆరోగ్య‌శాఖ గుర్తించింది. అందుకే, పాజిటివ్ వచ్చిన వాళ్ల ప్ర‌తి రిపోర్ట్ ను జీనోమ్ వ్యాలీ కేంద్రాల‌కు అధ్య‌య‌నం కోసం పంపాల‌ని స‌మావేశంలో తీర్మానించారు. మొత్తం మీద ఓ మైక్రిన్ సీరియ‌స్ గా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్ వో ఇచ్చిన నివేదిక ప్ర‌కారం కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. రాబోవు రోజుల్లో లాక్ డౌన్ దిశ‌గా మ‌ళ్లీ వెళ్లాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు భావించ‌డం గ‌మ‌నార్హం.