Site icon HashtagU Telugu

Unseen Photos Of Leaders: అంతకుముందు.. ఆ తర్వాత!

Leaders

Leaders

పుట్టుకతో అందరూ సామాన్యులే. కానీ గొప్ప సంకల్పం, అంకితభావం, కఠిన నిర్ణయాలతో సాధించనిది ఏదీ ఉండదు. అందుకు ఉదాహరణే వీళ్ల జీవితాలు. ఒకప్పుడు చాయ్ వాలా అవతారమెత్తిన నరేంద్ర మోడీ ప్రధాని పీఠం అధిరోహించి చరిత్రకెక్కాడు. ఇక రాజ్యాంగ అత్యున్నత పీఠం మెక్కిన రాష్ట్రపతి ముర్ము సైతం సాధారణ టీచర్ గా పనిచేసిన విషయం అందిరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆమె సాధారణ జీవితం గడుపుతుండటం విశేషం.

ఇక మహరాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆటో డ్రైవర్ గా జీవితం మొదలుపెట్టి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ సైతం సాధారణ సన్యాసి జీవితం ఆరంభించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి తానేంటో నిరూపించుకున్నారు. వీళ్లంతా దేశ ఉన్నత హోదాల్లో కొనసాగుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల జీవితాలకు అద్దం పట్టే ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫొటోలే ఇవీ.. మీరూ కూడా ఓ లుక్కేయండి మరి.