BSF: పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం చాలా కాలంగా చొరబాట్లకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతోంది. ఇక్కడి నదులు, చిత్తడి నేలల కారణంగా భద్రత కల్పించడం ఒక సవాలుగా మారింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరిహద్దును మరింత సురక్షితం చేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నిరంతరం కొత్త ఆలోచనలపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో చొరబాట్లను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఇప్పుడు ఒక కొత్త, విభిన్నమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
‘డిటరెన్స్-ఫస్ట్’ స్ట్రాటజీ
ఈ ప్లాన్ ప్రకారం.. సరిహద్దు వెంబడి విషపూరితమైన పాములు, తేళ్లు, మొసళ్లను ఉంచేందుకు కొన్ని ప్రాంతాలను అధికారులు గుర్తిస్తున్నట్లు ఓ మీడియా సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత ఎలా ఉంది?
ప్రస్తుతం BSF సరిహద్దులో సిబ్బందిని కాపలా ఉంచడంతో పాటు భద్రత కోసం డ్రోన్లు, సెన్సార్లు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు, అనేక రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది.
Also Read: Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ.300 తగ్గింపు ఎలాగంటే !!
ఏమిటి ఈ ప్లాన్?
భారత-బంగ్లా సరిహద్దులో ప్రత్యేక నిఘా ఉంచేందుకు ఈ తరహా భద్రతా ఏర్పాట్లపై ఆలోచిస్తున్నట్లు BSF వర్గాలు ఓ జాతీయ మీడియా సంస్థకు సమాచారం అందించాయి. సమాచారం ప్రకారం.. ఫెనీ నది, ఇచ్చామతి నది, గంగా/పద్మా నది, ముహూరి నదుల ద్వారా చొరబాట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ నదులలో సగం భాగం భారతదేశంలో, మిగిలిన సగం బంగ్లాదేశ్‌లో ప్రవహిస్తాయి.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 5 వేల కిలోమీటర్లు ఉంటుంది. ఇంత పొడవైన సరిహద్దుకు పూర్తిగా ఫెన్సింగ్ (కంచె) వేయడం సాధ్యం కాదు. అందుకే సరిహద్దులో విషపూరిత పాములు, తేళ్లు, మొసళ్లను ఉంచాలనే ఆలోచన చేస్తున్నారు. సుమారు 5 వేల కిలోమీటర్ల భారత్-బంగ్లా సరిహద్దులో దాదాపు 180 కిలోమీటర్ల మేర నదులు, చిత్తడి నేలలు ఉన్నాయి. అక్కడ కంచె వేయడం చాలా కష్టం. ఈ చిత్తడి నేలలను ఆసరాగా చేసుకుని చొరబాటు ప్రయత్నాలు జరుగుతుంటాయి. BSF వీటిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ కొత్త ప్లాన్‌ను అమలు చేయాలని యోచిస్తోంది.
