Indian Constitution: భారత పార్లమెంటు అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. అయితే భారత రాజ్యాంగానికి (Indian Constitution) సంబంధించి దేశంలో ఎప్పుడూ రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గం రాజ్యాంగాన్ని డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ మాత్రమే రచించారని చెబుతుండగా.. రెండో వర్గం ఈ వాదనను అంగీకరించదు. చరిత్రలో దీని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ ప్రారంభం నుంచీ ప్రజల్లో గందరగోళం లేదా తమ తమ అభిప్రాయాలపై పట్టుదల కొనసాగుతోంది. ఈ పూర్తి సంఘటనను తార్కిక వివరణతో మీకు అందిస్తున్నాము.
రాజ్యాంగ రచనకు దారి తీసిన సంఘటనలు
దేశంలో విప్లవ దశ నడుస్తోంది. స్వాతంత్య్రం సమరం మొదలైంది. భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటికీ స్వాతంత్య్రపు శంఖారావం మోగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జూలై 1945లో బ్రిటన్ భారతదేశం కోసం తన కొత్త విధానాన్ని ప్రకటించింది.
19 సెప్టెంబర్, 1945న వైస్రాయ్ లార్డ్ వేవెల్ భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు డిసెంబర్ 1945 నుండి జనవరి 1946 వరకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల తర్వాత ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయబడుతుందని, అదనంగా ఒక రాజ్యాంగ-నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేయబడుతుందని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతదేశంలో రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడానికి బ్రిటన్ ముగ్గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ మిషన్‌ను పంపింది.
Also Read: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!
రాజ్యాంగ సభ ఏర్పాటు
రాజ్యాంగ సభలో ఎన్నికైన సభ్యులందరూ ఉన్నారు. ఈ సభ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయవలసి ఉంది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. డా. రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 389 మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచినప్పటికీ, దేశ విభజన తర్వాత భారత రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు మిగిలారు.
ముసాయిదా కమిటీ ఏర్పాటు
రాజ్యాంగ సభ, రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఆగస్టు 29, 1947న ప్రారంపక కమిటీని ఏర్పాటు చేసింది.దీనికి డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సలహాదారు అయిన బి.ఎన్. రావు మొదట రాజ్యాంగం ప్రాథమిక ముసాయిదాను తయారు చేశారు. ఆ తర్వాత, డ్రాఫ్టింగ్ కమిటీ బి.ఎన్. రావు తయారుచేసిన ముసాయిదాను చట్టపరమైన పత్రంగా మార్చింది. రాజ్యాంగ సభ డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు కష్టపడింది. ఈ కృషి తర్వాత నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇది జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ సభ 1950లో స్వతంత్ర భారతదేశం మొదటి పార్లమెంట్‌గా పనిచేసింది.
అంబేద్కర్ పాత్ర
మరింత సరళమైన భాషలో చెప్పాలంటే.. డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ కేవలం డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు మాత్రమే. బి.ఎన్. రావు రాజ్యాంగ సలహాదారుగా, రాజ్యాంగం మొదటి ముసాయిదాను తయారు చేశారు. ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీలోని 7 గురు సభ్యులు సుమారు 3 సంవత్సరాల సమయం వెచ్చించి, ఆ ముసాయిదాను మెరుగుపరిచారు. అవసరమైన మార్పులు చేశారు. అనంతరం డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డా. భీమ్‌రావు అంబేద్కర్ తుది ముసాయిదాను రాజ్యాంగ సభ అధ్యక్షుడు డా. రాజేంద్ర ప్రసాద్‌కు సమర్పించారు. రాజ్యాంగ సభ, మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఆ ముసాయిదాను భారతదేశ రాజ్యాంగంగా మలచింది.
