Site icon HashtagU Telugu

Tricolour Rules: ఆగస్టు 15న జెండా ఎగరేయబోతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Tricolour Rules

Indian Flag

Tricolour Rules: ఈ సంవత్సరం భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని 15 ఆగస్టు 2023న జరుపుకుంటున్నారు. ఈరోజ దేశం అంత జెండా (Tricolour Rules) ఎగరవేస్తారు. ఇది మన దేశపు జాతీయ పండుగ. దీనికి సన్నాహాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న మన దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ కార్యాలయాలు మొదలైన వాటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 సంవత్సరంలో అమలు చేయబడింది. ఇప్పుడు దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి, దించటానికి నియమాలు ఇవే..!

జెండాను ఎగరేసేటప్పుడు అది చిరిగిపోయి ఉండకూడదు. తిరగబడిన జెండాను ఎగరవేయరాదు. సరైన స్థలంలోనే జెండాను ఎగరేయాలి. జెండాను ఎగరేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాఎ గురవేయకూడదు. జెండాను ఎలాంటి అలంకరణకు ఉపయోగించకూడదు. జెండానుఎగురవేసేటప్పుడు, కాషాయ రంగు పైకి ఉండేలా జాగ్రత్త వహించాలి. జెండా కర్ర మీద లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టకూడదు. జెండాపై ఏమీ రాయకూడదు. జెండాను ఎగురవేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు పువ్వులు అందులో ఉంచవచ్చు. జాతీయ జెండా నేల మీద పడేయకూడదు. జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు. జెండాను ఎగురవేసేటప్పుడు, అది జెండా కర్రకు కుడి వైపున ఉండాలి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతోపాటు దించేటపుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాడుతున్న త్రివర్ణ పతాకాన్ని ఎక్కడా ఛిద్రం చేయకూడదు.

Also Read: Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం రోజు మీరు ఇలాంటి డ్రెస్ లు ట్రై చేయండి..!

మీరు కూడా ఈసారి జెండాను ఎగురవేయబోతున్నట్లయితే భారత జెండా కోడ్ 2002ను పరిమిత పద్ధతిలో, నిబంధనల ప్రకారం ఎగురవేయవచ్చు. జెండాను ఎగురవేసిన తర్వాత, జెండాను దించే సమయంలో కూడా నిబంధనలను పాటించండి. నిబంధనల ప్రకారం దేశంలోనే అతిపెద్ద పండుగను జరుపుకోండి.