MP Quota in KV : కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీ కోటా ర‌ద్దు

కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీల కోటాను తొల‌గిస్తూ కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - April 13, 2022 / 05:05 PM IST

కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీల కోటాను తొల‌గిస్తూ కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. చాలా కాలంగా ఎంపీల‌కు ఆ స్కూల్స్ ప్ర‌వేశాలకు సంబంధించిన కోటా ఉంది. ఒక్కో ఎంపీకి తొలుత రెండు సీట్లు ఉండేవి. ఆ త‌రువాత వాటి సంఖ్య‌ను క్ర‌మంగా పెంచుతూ 10కి చేర్చారు. కానీ, కొంద‌రు ఎంపీలు కోటాకు మించిన విధంగా సిఫార‌స్సు లేఖ‌లు పంపిస్తున్నారు. దీంతో ఎవ‌రికి సీటు ఇవ్వాలో అర్థంకాని ప‌రిస్థితికి చాలా సంద‌ర్భాల్లో కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ వ‌చ్చింది. అందుకు సంబంధించి కొన్ని గొడ‌వ‌లు కూడా. అయ్యాయి. దీంతో ఎంపీల‌కు కోటా లేకుండా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కేంద్రీయ విద్యాల‌యాల ప్ర‌వేశాల‌కు సంబంధించి బుధ‌వారం కీల‌క ప‌రిణామం ఎంపీల‌కు షాక్ న్యూస్ గా మారింది. ప్ర‌తి జిల్లాలో క‌నీసం ఒక‌టి చొప్పున కార్య‌క‌లాపాలు సాగిస్తున్న‌కేంద్రీయ విద్యాల‌యాల్లో విద్యార్థుల ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపీల కోటా ర‌ద్దు అయిపోయింది. ఆ కేంద్రీయ విద్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ బుధ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీల‌కు ఏటా 10 సీట్ల‌ను కేటాయిస్తున్నారు. ఆ సీట్ల‌ను అనుకూలంగా ఉన్న వారి పిల్ల‌ల‌కు కేటాయిస్తూ ఎంపీలు లేఖ‌లు జారీ చేస్తున్నారు. కొంద‌రు ఎంపీలు ప‌రిమితికి మించి సిఫార‌సు లేఖ‌లు పంపుతున్నారు. ఇలా చేయ‌డం కేంద్రీయ విద్యాల‌యాల ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపీ కోటా సీట్ల భ‌ర్తీ కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్‌కు పెను స‌మ‌స్య‌గా మారింది. ఆ క్ర‌మంలో ఎంపీ కోటానే ఎత్తివేస్తూ కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం కొస‌మెరుపు.