కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర మార్గదర్శకాలను ఓమైక్రిన్ నియంత్రణ కోసం విడుదల చేసింది.కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ అయిన ఓమిక్రాన్‌పై తరచుగా అడిగే ప్రశ్నలకు (FAQలు) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. వ్యాధి తీవ్రత తక్కువ ఉంటుందని భావిస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. డెల్టా వేరియెంట్ కు తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేసింది. ఓమిక్రాన్ రూపంలో మూడే వేవ్ ఇండియాలోకి ప్రవేశించింది.
దక్షిణాఫ్రికా వెలుపలి దేశాలలో ఓమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, దాని లక్షణాలను బట్టి చూస్తే ఇది భారత్‌తో సహా మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయినప్పటికీ, కేసుల పెరుగుదల స్థాయి, పరిమాణం, వ్యాధి తీవ్రతపై స్పష్టత లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు ఓమిక్రాన్‌లో పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ, కొన్ని ఉత్పరివర్తనాలు టీకాల సామర్థ్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ టీకాలు ఎంతో కొంత రక్షణ కల్పిస్తాయని అంచనా వేస్తోంది.
మాస్క్ చేసుకోవడం, టీకాలు వేయకపోతే రెండు డోస్‌ల టీకాలు తీసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం ,సాధ్యమైనంత వరకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
RT-PCR పరీక్షలు వైరస్ ఉనికిని నిర్ధారించడానికి స్పైక్ (S), ఎన్వలప్డ్ (E), మరియు న్యూక్లియోకాప్సిడ్ (N) వంటి నిర్దిష్ట జన్యువులను గుర్తించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. “అయినప్పటికీ, ఓమిక్రాన్ విషయంలో, S జన్యువు భారీగా పరివర్తన చెందినందున, కొన్ని ప్రైమర్‌లు S జన్యువు (S జీన్ డ్రాప్ అవుట్ అని పిలుస్తారు) లేకపోవడాన్ని సూచించే ఫలితాలకు దారితీయవచ్చు,ష వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది. ఓమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం జెనోమిక్ సీక్వెన్సింగ్ అవసరం” అని తెలిసింది.