Site icon HashtagU Telugu

Coronavirus: క‌రోనా ఫోర్త్ వేవ్ మామూలుగా ఉండ‌ద‌ట‌..!

Corona 4th Wave India

Corona 4th Wave India

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మ‌రోసారి పంజా విస‌ర‌నుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే మూడు వేవ్‌ల‌తో ప్ర‌జ‌లు అన్ని ర‌కాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు నాలుగో వేవ్ డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా ఇండియాకు కూడా క‌రోనా ఫోర్త్ వేవ్ త‌ప్ప‌దంటున్నారు. ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు, కొత్త కొత్త రూపాలు, స‌రికొత్త ల‌క్ష‌ణాల‌తో క‌రోనా విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే భార‌త్‌లో 4.30 కోట్ల మంది కరోనా వైరస్ బాడ‌గా, ఐదు ల‌క్ష‌ల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్‌డౌన్ క‌ట్టుదిట్టంగా అమ‌లు చేయ‌డంతో పాటు, క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో ఇప్పుడిప్పుడే ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం స్కూల్స్ రీఓపెనింగ్ అవ‌గా, ఉద్యోగులు ఆఫీసుల‌కు వెళుతున్నారు. మాస్కుల నిబంధ‌న‌లు కూడా స‌డ‌లించ‌డంతో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

ఇక మరోవైపు పొరుగున ఉన్న‌ చైనాలో కరోనా మ‌రోసారి విజృంభిస్తున్న క్ర‌మంలో అక్క‌డ మ‌రోసారి లాక్ డౌన్ విధించారు. ప్ర‌స్తుతం చైనాలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెగుతుండ‌డంతో భారత్‌కు కూడా ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోన్ థర్డ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం బీఏ.2 వేరియంట్ అని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉంకా కనిపిస్తున్నాయని, అందువల్ల నాలుగో దశ కరోనా వైరస్ వ్యాప్తి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఈసారి ఫోర్త్ వేవ్ విరుచుకుప‌డే అవ‌కాశం ఉందని, ఈసారి ఏకంగా 75 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక‌పోతే దేశంలో జులై నుండి ఫోర్త్ వేవ్ ప్రారంభమవుతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.