దలైలామా (Dalai Lama) 90వ పుట్టినరోజు (Dalai Lama 90th Birthday) సందర్భంగా తన వారసుడి ప్రకటన చేస్తారా..? అనే ప్రశ్న టిబెటన్ సమాజంలో ఉత్కంఠ రేపుతోంది. జూలై 6న 90వ ఏట అడుగుపెట్టనున్న దలైలామా, తమ వారసుడిని ప్రకటించడం ద్వారా చైనా చొరబాట్లకు ప్రతిఘటన చేయగలరా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిబెటన్ బౌద్ధమత పునర్జన్మ సిద్దాంతం ప్రకారం, దలైలామా తన తర్వాతి జన్మను గుర్తించాల్సి ఉంటుంది. కానీ, చైనా ప్రభుత్వం దీనిపై తమ నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీజింగ్ ఈ ప్రక్రియను చైనా భూభాగంలో నిర్వహించాలని పట్టుబడుతోంది. మెక్‌లియోడ్‌గంజ్‌లో జరుగుతున్న ఈ వేడుక దలైలామా నిర్ణయం కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ నిర్ణయం టిబెటన్ సంప్రదాయానికి చారిత్రాత్మక మలుపు కావచ్చు. టిబెటన్ నాయకత్వం కోసం పంచన్ లామా దృవీకరణ పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఇదే సందర్బంగా దలైలామా చేయబోయే ప్రకటన టిబెటన్ బౌద్ధ సమాజం భవిష్యత్ దిశను నిర్ణయించనుంది. అదే సమయంలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఈ ప్రక్రియ ఎలా సహాయపడుతుందో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్ భక్తులు ఈ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిబెట్‌పై చైనా ప్రభావం పెరిగే క్రమంలో, దలైలామా వారసత్వం రాజకీయంగా కూడా కీలకంగా మారింది. టిబెటన్ సామాజిక గౌరవం, భవిష్యత్తు స్ఫూర్తికి ఈ నిర్ణయం ప్రధానమని భావిస్తున్నారు.
దలైలామా (Dalai Lama) పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బౌద్ధుల హృదయాలు పూజ్య భావంతో బరువెక్కుతాయి. దలైలామా బుద్ధుల మత గురువే కాదు ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత కూడా. అహింసాయుతంగా టిబెట్ స్వాతంత్ర్యం కోసం ఏభై ఏళ్ళుగా పోరాడుతున్నాడు. 1933 లో 13వ దలైలామా నిర్యాణం తరువాత ఈయన 1935 జూలై 6 తేదీన ఉత్తర టిబెట్ లోని థక్సర్ లో పుట్టాడు. ఈయన అసలు పేరు లామోస్ తొండప్.
నాలుగేళ్ళకే బౌద్ధ సన్యాసిగా మారిన తొండప్ తరువాత 14 వ దలైలామాగా అవతరించాడు. చైనా టిబెట్ ని ఆక్రమించి, అక్కడ నుంచి దలైలామాని వెళ్ళగొట్టడంతో 1959 నుంచీ ఈయన భారతదేశంలో శరణార్ధిగా ఉంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని ధర్మశాలకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండల మీద మెక్లోడ్ గంజ్ లో ఈయన భవనం ఉంది. ఆ ఆవరణలో ఉండే ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. దలైలామాలంతా బుద్ధుని అంశ అయిన అవలోకేశ్వరుని పునర్జన్మలని బౌద్ధుల నమ్మకం. దలైలామా మరణిస్తే, మళ్ళీ ఇంకో చోట పుట్టి, మళ్ళీ దలైలామాగా పగ్గాలు చేపడతాడని బౌద్ధుల విశ్వాసం. మహాత్మా గాంధీ మార్గంలో టిబెట్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న దలైలామాకి నోబుల్ శాంతి బహుమతి కూడా లభించింది.
Read Also : KTR Vs ED : ఈడీ నోటీసులిచ్చిన మాట వాస్తవమే.. లీగల్‌గా ఎదుర్కొంటా : కేటీఆర్