Site icon HashtagU Telugu

Ex-PM Deve Gowda: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని దేవెగౌడ

Deve Gowda

Resizeimagesize (1280 X 720) 11zon

మాజీ ప్రధానమంత్రి , జెడిఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ (Deve Gowda) మంగళవారం ఆసుపత్రిలో చేరారు. దేవెగౌడ ‘రొటీన్ చెకప్’ కోసం అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా ధృవీకరించారు. భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ప్రధాని అన్నారు.

ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని దేవెగౌడ.. తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇలా పేర్కొన్నారు. “నేను సాధారణ తనిఖీల కోసం ఆసుపత్రికి వచ్చాను. భయపడవలసిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాను” అని ట్వీట్ చేశారు. అయితే.. దేవెగౌడ తన ఆరోగ్యం గురించి ఎక్కువ సమాచారం పంచుకోలేదు, కానీ ఆయన మోకాలి నొప్పితో సహా ఇతర వయస్సు సమస్యలతో బాధపడుతున్నారు. అంతకుముందు ఆయనకు కరోనా సోకింది. అలా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.

Also Read: Upasana: అమెరికాలో డెలివరీ గురించి క్లారిటీ ఇచ్చిన ఉపాసన.. ఇంతకు డెలివరీ ఎక్కడంటే?

దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి తన తండ్రి ఆసుపత్రిలో చేరడం గురించి తెలియజేస్తూ.. “తన తండ్రి ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అతను (దేవెగౌడ) అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. జార్ఖండ్‌లోని హసన్‌ సీటుతో సహా కొన్ని నియోజకవర్గాలకు జెడి(ఎస్‌) టిక్కెట్లపై నిర్ణయం తీసుకుంటాం. 120 సీట్లలో గెలిచి వారికి(దేవేగౌడ)కు బహుమతి ఇవ్వడానికి పోరాడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని జేడీఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కింగ్‌మేకర్‌గా అవతరించాలని భావిస్తున్నారు. 2018 లాగా ఈసారి కూడా ఆయన లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని కుమారస్వామి భావిస్తున్నారు.