Site icon HashtagU Telugu

9/11 Report: ముంబై పేలుళ్లపై వెలుగులోకి సంచలన విషయాలు.. అలా చేశారంటూ?

2008 Mumbai Attack

2008 Mumbai Attack

26/11 ముంబై బాంబు పేలుడ ఘటన గురించి వినగానే ప్రతి భారతీయుడు గుండెల్లో గుబులు రేగుతోంది. 2008లో ముంబైలో ఉగ్ర మూకలు జరిపిన విధ్వంసం భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరువలేని ఓ చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. ఈ ఉగ్రదాడి భారతీయులకు ఎప్పటికీ గుర్తు ఉంటంది. ఈ ఘటన జరిగి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు అయినా సరే.. లష్కరే ఈ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయిూద్ పై పాకిస్తాన్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ దాడి అతడు చేయించినట్లు ఆధారాలు ఉన్నా కూడా దాయాది పాక్ ఇప్పటికీ అతడిపై చర్యలు తీసుకోలేదు.

అయితే ఈ ఘటన గురించి ఇస్తామాబాద్ లో అప్పుడు భారత రాయబారిగా ఉన్న శరత్ సబర్వాల్ తాజాగా తన పుస్తకంలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ముంబై దాడులు జరిగిన రెండేళ్లలోపే సయిూద్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను పాక్ ఆర్మీని కోరానని, కానీ అతడిపై ఎలాంటి ఆధారాలు లేనందును చర్యలు తీసుకోలేదని పాక్ ఆర్మీ తెలిపినట్లు శరత్ సబర్వాల్ తన పుస్తకం ఇండియాస్ పాకిస్తాన్ కాన్ డ్రమ్ లో తెలిపాడు. ముంబైలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మారణహోమంపై ఇండియాతో పాటు ఇతర దేశాలు పాక్ తో సాక్ష్యాలు పంచుకున్నాయన్నారు. లష్కరే తోయిబాకు చెందిన 10 మంది సభ్యులు కరాచీ నుంచి నౌక ద్వారా ముంబైలోకి చొరబడ్డారని తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ దాడుల్లో హఫీజ్ సయిూద్ పాత్ర గురించి కసబ్ తెలిపిన వివరాలతో పాటు ఇతర ఆధారాలు లభించాయన్నారు.

ఆగస్టు 2010లో పాకిస్తాన్ కు చెందిన ఓ సీనియర్ ఆర్మీ అధికారితో జరిగిన సంభాషణను తన పుస్తకంలో సబర్వాల్ రాశారు. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ చెప్పిన నాలుగు పాయింట్లను పొందపర్చారు. ముంబై ఉగ్రదాడికి సైన్యం లేదా ISI నాయకత్వం ఇవ్వలేదని పాక్ ఆర్మీ ఆఫీసర్ చెప్పాడట. ఇక ఇండియా వేగంగా డెవలప్ అవుతున్న క్రమంలో ఇలాంటి చర్యలు భారత పురోగతిని ఆపలేవని, పాక్ ప్రజలకు మెరుగైన ఆర్థిక, ఆరోగ్యం, విద్యా సౌకర్యాలను కల్పించడానికి సహాయం చేయవని ఆర్మీ అధికారులు భావించారట. ముంబై దాడుల్లో నేరస్థులను పట్టుకోవడానికి పాక్ ఆర్మీ సహాయం చేసిందని, కానీ హఫీజ్ సయిూద్ పై ఎలాంటి ఆధారాలు లేనందున చర్యలు తీసుకోలేదని పాక్ ఆర్మీ అధికారి చెప్పినట్లు సబర్వాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. తన అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం గురించి పాక్ ఆందోళన కలిగి ఉందని, వాటిని పరిష్కరించాలని కోరుకుంటుందని పాక్ ఆర్మీ ఆఫీసర్ చెప్పినట్లు సబర్వాల్ పుస్తకంలో తెలిపాడు.

Exit mobile version