Nabam Tuki : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 05:32 PM IST

 

Nabam Tuki: అరుణాచల్‌ ప్రదేశ్‌( Arunachal Pradesh) రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్‌ టుకీ(Former Chief Minister Nabam Tuki)రాజీనామా(resignation) చేశారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ(bjp)లో చేరడంతో.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నబామ్‌ టుకీ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయాని(Allindia Congress Committee office)కి పంపించారు. బీజేపీలో చేరిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా నిలువరించలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నబామ్‌ టుకీ రాజీనామా చేశారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి గ్యామార్‌ తానా చెప్పారు.

read also : Harish Rao: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే… హామీలు అమలవుతాయి: హరీశ్ రావు

ఈ నెల మొదట్లో సీనియర్‌ ఎమ్మెల్యే, అరుణాచల్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత లోంబో తాయెంగ్‌ బీజేపీలో చేరారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈస్ట్‌ సియాంగ్‌ జిల్లాలోని మెబో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు అంటే ఫిబ్రవరిలో నినాంగ్‌ ఎరింగ్‌, వాంగ్లిన్‌ లొవాంగ్‌డాంగ్‌ కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.