Site icon HashtagU Telugu

Lok Sabha Polls Phase 7 : ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు

Evm And Vvpat Machine Were

Evm And Vvpat Machine Were

లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా నేడు చివరి పోలింగ్ దశ జరుగుతుంది. ఈరోజు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ విడతలో ముఖ్యనేతలు ప్రధాని మోదీ (వారణాసి), అనురాగ్ ఠాకూర్ (హమీర్పుర్), అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్), కంగనా రనౌత్ (మండీ) బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా పోలింగ్ మొదలైన కాసేపటికే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్ లో గందరగోళం పరిస్థితి నెలకొంది. పోలింగ్ బూత్ లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించకపోవడంతో.. కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏడో దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.31% ఓటింగ్ నమోదైంది. బిహార్ 10.58%, చండీగఢ్ 11.64%, హిమాచల్ ప్రదేశ్ 14.35%, ఝార్ఖండ్ 12.15%, ఒడిశా 7.69%, పంజాబ్ 9.64%, ఉత్తరప్రదేశ్ 12.94%, బంగాల్ 12.63%. మరోపక్క హిమాచల్ ప్రదేశ్​లోని మండిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓటేశారు. పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బీజేపీ నేత తరణ్‌జిత్‌ సింగ్‌, లఖ్‌నౌర్‌లో ఆప్‌నేత రాఘవ్‌ చద్దా, జలంధర్‌లో క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బీజేపీ హమిర్​పుర్ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్​, ఆయన భార్య శెఫాలీ ఠాకూర్​తో ఓటేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్‌ ఓటు వేశారు.

Read Also :