Sonia Gandhi: కాంగ్రెస్ మ్యానిఫెస్టో(Congress Manifesto)లో పేర్కొన గ్యారంటీలపై కాంగ్రెస్(Congress)పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడుతూ..తమ మ్యానిఫెస్టోలో తెలిపిన గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని అన్నారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
नमस्ते मेरी प्यारी बहनों 🙏🏼
स्वतंत्रता की लड़ाई से लेकर आधुनिक भारत बनाने में महिलाओं का बहुत बड़ा योगदान रहा है।
हालांकि आज हमारी महिलाएं भयंकर महंगाई के बीच संकट का सामना कर रही हैं।
उनकी मेहनत और तपस्या के साथ न्याय करने के लिए कांग्रेस एक क्रांतिकारी कदम लेकर आई है।… pic.twitter.com/Wk7JGt8x7r
— Congress (@INCIndia) May 13, 2024
”స్వాతంత్ర్య సంగ్రామం మొదలుకొని నేటి ఆధునిక భారత నిర్మాణం వరకు మహిళల కృషి మరువలేనిది. కానీ, ద్రవ్యోల్బణం వల్ల నేడు వారు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వారి కష్టానికి న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ విప్లవాత్మక గ్యారంటీతో ముందుకొచ్చింది. మహాలక్ష్మి పథకంతో ప్రతి పేద మహిళకు సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తాయి” అని సోనియా గాంధీ హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే తాము అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని సోనియా పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి విప్లవాత్మక చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులకు కాంగ్రెస్ పార్టీ సాధికారత కల్పించిందన్నారు. మహాలక్ష్మి ద్వారా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
Read Also: Sitara Ghattamaneni : సితార పాప స్టైలిష్ డాన్స్.. నమ్రతా, శ్రీలీల కామెంట్స్..
కాగా, సోనియా గాంధీ వీడియో సందేశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు పార్టీ నేతలు తమ ‘ఎక్స్’ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఒక్క ఓటు విలువ సంవత్సరానికి రూ.లక్షతో సమానమని సోనియా సందేశాన్ని షేర్ చేస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ”నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న మహిళలకు కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం సంజీవనిలా పనిచేయనుంది. ప్రతినెలా ఖాతాల్లో రూ.8,500 జమ అయితే ఆర్థికంగా ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీ కుటుంబ భవిష్యత్తును మీరే నిర్దేశించగలరు” అని రాహుల్ రాసుకొచ్చారు.