Site icon HashtagU Telugu

PF Withdrawal: గుడ్ న్యూస్.. పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మార్చిన ఈపీఎఫ్‌వో..!

Cropped (1)

Cropped (1)

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విత్‌డ్రాకు సంబందించిన రూల్స్ ను మార్చింది. ఈ చేంజ్ అయిన రూల్స్ వలన కొంతమందికి ప్రయోజనం కలగనుంది. దింతో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 199 (ఈపీఎస్ 95)లో జమ అయిన డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం సులభం కానుంది. ఆరు నెలల సర్వీస్ కలిగిన వారు ఈపీఎస్ 95 డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికిఅనుమతినిచ్చింది ఈపీఎఫ్‌వో. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రైబర్లు ఆరు నెలల కన్నా తక్కువ సర్వీస్ కలిగి ఉంటే.. కేవలం ప్రావిడెంట్ ఫండ్‌లో ఉన్న డబ్బులను మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ సారథ్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తన 232వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సోమవారం ఈ మీటింగ్ జరిగింది. రూల్స్‌ను సవరిస్తున్నట్లు సీబీటీ వెల్లడించింది. ఈ మేరకు ఈపీఎస్ 95 స్కీమ్ సవరించిన రూల్స్‌కు ఆమోదం తెలియజేయాలని కార్మిఖ శాఖ కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

ఆరు నెలల కన్నా తక్కువ సర్వీస్ కలిగిన వారికి ఈపీఎస్ అకౌంట్ విత్‌డ్రా బెనిఫిట్‌ను విస్తరించాలని కోరింది. ఇంకా 34 ఏళ్లకు పైగా పథకంలో ఉన్న సభ్యులకు ప్రొపార్షినేట్ పెన్షనరీ బెనిఫిట్స్‌ను అందించాలని కూడా బోర్డు సిఫార్సు చేసింది. రిటైర్‌మెంట్ బెనిఫిట్‌ని నిర్ణయించే సమయంలో పెన్షనర్లు అధిక పెన్షన్ పొందడానికి ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ అంశానికి సంబంధించి రిడెంప్షన్ పాలసీకి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

2022-23 వడ్డీ రేటు లెక్కింపు కోసం ఆదాయంలో చేర్చడానికి క్యాపిటల్ గెయిన్‌లను బుకింగ్ చేయడం కోసం 2018 పీరియడ్ క్యాలెండర్ ఇయర్‌లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్ల విక్రయానికి బోర్డు ఆమోదించింది. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రపంచ స్థాయి సామాజిక భద్రత అందించడంలో ఈపీఎఫ్‌వో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన కీలక వ్యూహాలను కూడా బోర్డు చర్చించింది. అలాగే ఈపీఎఫ్ మినహాయింపు రద్దు కోసం 11 ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. సీబీటీ ఈపీఎఫ్‌వో సమాచార భద్రతా విధానానికి సంబంధించి సర్వర్ డేటాబేస్ నిల్వలకు ఐటీ హార్డ్‌వేర్ కొనుగోలు కోసం ఒక సాధారణ విధానానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. కాగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అందుకే కీలక అంశాలపై చర్చలు జరుపుతోంది.