Site icon HashtagU Telugu

Death Claim : పీఎఫ్ ‘డెత్‌ క్లెయిమ్‌’ల‌కు ఇక అది అక్కర్లేదు

Mobile Number With Aadhaar

Mobile Number With Aadhaar

Death Claim : ‘ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా’కు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్‌వో తీసుకుంది. పీఎఫ్ అకౌంటుకు ఆధార్‌ నంబర్‌‌ను లింక్ చేయకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు కీలక వెసులుబాటును  కల్పించింది. మరణించిన ఈపీఎఫ్‌వో సభ్యుల కేసుల్లో ఆధార్‌ లింక్ లేకున్నా.. డెత్ క్లెయిమ్(Death Claim) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈపీఎఫ్‌వో సభ్యుడు చనిపోయాక ఆధార్‌ కార్డు వివరాల్లో మార్పులు చేయడం కష్టమని.. అందుకే ఇలాంటి కేసుల్లో ఆధార్‌ నంబరు లింకు లేకున్నా క్లెయిమ్‌లు ప్రాసెస్‌ చేయాలని తమ అధికారులకు నిర్దేశించింది. ఈ వివరాలను ఈ-ఆఫీస్‌ దస్త్రం కింద ఇన్‌ఛార్జి అధికారి పరిశీలించి, నిజమైన క్లెయిమ్‌లుగా గుర్తించిన తర్వాతే ప్రాసెస్‌ చేయాలని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. పీఎఫ్‌ ఖాతా వివరాలన్నీ కరెక్టుగా ఉన్నప్పటికీ, ఆధార్‌ వివరాలు అసంపూర్తిగా ఉన్న కేసులకే ఈ నిబంధనను వర్తింపజేయాలని తెలిపింది.ఆధార్‌ వివరాలు సక్రమంగా ఉండి, పీఎఫ్‌ ఖాతాలో సమాచారం అసంపూర్తిగా ఉన్న సందర్భాల్లో ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అదనపు ప్రధాన కమిషనర్‌ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Lok Sabha Elections 2024 : ఐదో విడత పోలింగ్​ ప్రారంభం.. కొత్త రికార్డు సృష్టించాలని ఓటర్లకు ప్రధాని పిలుపు