Childhoods Chained : బాల్య వివాహపు సంకెళ్లలో బాల్యం బలైపోతోంది. చాలామందికి మేజర్లు కాకముందే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఎంతోమందికి పదేళ్లలోపు ఏజ్‌లోనే నిశ్చితార్ధం జరిగి.. మేజర్ అయ్యాక పెళ్లి చేస్తున్నారు. మరెంతో మందికి తల్లి కడుపులో ఉండగానే ఎంగేజ్‌మెంట్ జరుగుతోంది.. పుట్టి, పదేళ్లు దాటాక ఆ ఎంగేజ్‌మెంట్ ప్రకారం మ్యారేజ్‌లు జరుగుతున్నాయి. ఈవిధంగా ఏకపక్షంగా, పిల్లల హక్కులను హరించేలా జరుగుతున్న బాల్య వివాహాలకు మధ్యప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డున ఉన్న రాజ్‌గఢ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాలు వేదికలుగా మారాయి. ప్రత్యేకించి ఈ కథనంలో మనం రాజ్‌గఢ్ జిల్లాలోని జైత్‌పురా గ్రామంలోని కొన్ని కేస్ స్టడీలను చూద్దాం..
Also Read :Virat Anushka : సాధారణ కేఫ్‌లో విరాట్, అనుష్క క్రిస్మస్ బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా ఏం చేశారంటే..
జైత్‌పురా గ్రామంలోని చాలామంది యువతులు, బాలికలు కాళ్లకు కడియాలు(Childhoods Chained) ధరిస్తుంటారు. వాటిని చూసి అక్కడ కడియాలు ధరించే సంప్రదాయం ఉందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ కడియాల వెనుక.. కన్నీళ్లు ఉన్నాయి.. కష్టాలు ఉన్నాయి.. కర్కశత్వం ఉంది. పిల్లలను పుట్టీ పుట్టకముందే అమ్మేసిన.. పెళ్లి చేసేసిన తల్లిదండ్రుల బండరాళ్ల లాంటి గుండెలు ఉన్నాయి. ఔను.. గత కొన్ని దశాబ్దాలుగా జైత్‌పురా గ్రామం పరిధిలో బాల్యవివాహాల కారణంగా ఎంతోమంది బాలికల జీవితాలు దెబ్బతిన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లు అవుతున్నా.. ఇలాంటి దురాచారం కంటిన్యూ అవుతుండటం, బాలల జీవితాలను మసకబారుస్తుండటం శోచనీయం. ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా ఈ దురాచారాలకు అడ్డుచెప్పేందుకు మధ్యప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు సాహసం చేయడం లేదు. ఒక్క జైత్‌పురా గ్రామంలోనే దాదాపు 700 మంది ఆడపిల్లల జీవితాలు ఈ సామాజిక దురాచారాల కారణంగా అంధకారపు ఊబిలో చిక్కుకున్నాయి.
Also Read :Lottery King Case : లాటరీ కింగ్ ల్యాప్‌టాప్, ఫోన్లపై సుప్రీంకోర్టు కీలక ఆర్డర్
రమాబాయి ఏం చెప్పిందంటే..
‘‘నా పేరు రమాబాయి. వయసు 40 ఏళ్లు. నాకు పదేళ్ల వయసులోనే పెళ్లయింది. అయితే తల్లిదండ్రులు నా నిశ్చితార్ధాన్ని ఆరేళ్ల వయసులోనే చేసేశారు. మా ఊరు జైత్‌పురాలో నిత్యం ఎంతోమంది ఆడపిల్లలకు ఇలా పెళ్ళిళ్ళు, నిశ్చితార్ధాలు జరుగుతుంటాయి’’ అని చెప్పింది.
గీత ఏం చెప్పిందంటే..
‘‘నా పేరు గీత.. వయసు 22 ఏళ్లు. నాకు రెండేళ్ల వయసులో నిశ్చితార్ధం జరిగింది. 16 ఏళ్ల వయసులో పెళ్లయింది. నాకు ఒక కూతురు ఉంది. ఆమెకు ఇలా బాల్యవివాహం జరగనివ్వను’’ అని వివరించారు.
గ్రామస్తులు ఇంకా ఏం చెప్పారంటే..
‘‘మా ఊరిలో దారుణ దురాచారాలు నడుస్తున్నాయి. జగ్డ, నట్ర అనే దురాచారాల వల్ల ఆడపిల్లలు బతుకులు నాశనం అవుతున్నాయి. కొంతమంది మద్యం మత్తులో అప్పులు తీసుకొని.. తమకు పుట్టబోయే పిల్లలకు నిశ్చితార్ధాలు ఫిక్స్ చేస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం ఆడ పిల్లల జీవితాలను తాకట్టు పెడుతున్నారు. పిల్లలు కడుపులో ఉండగానే నిశ్చితార్ధాలు ఫిక్స్ చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇలా ఫిక్స్ అయిన మ్యారేజ్‌ను ఎవరైనా బాలిక లేదా యువతి ఎదిరిస్తే.. అలాంటి కుటుంబాలపై కుల పెద్దలు జరిమానాలు వేస్తున్నారు. వేధిస్తున్నారు’’ అని జైత్‌పురా గ్రామానికి చెందిన పలువురు తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిశ్చితార్ధం జరిగిన సూచికగా ఆడపిల్లల కాళ్లకు వేస్తున్న కడియాలను తీసేందుకు కూడా కనీస అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఆ కడియాలు కాళ్లకు సంకెళ్లుగా మారాయని తెలిపారు.