PM Modi: మోడీ కోవిడ్ మూడో వేవ్ అల‌ర్ట్..వ్యాక్సినేష‌న్ కు మ‌త పెద్ద‌ల భాగ‌స్వామ్యం

రాజ‌కీయాలకు ఏదీ అతీతం కాదు..న‌రేంద్ర మోడీ ఏ చిన్న విష‌యాన్నైనా అనుకూలంగా మ‌లుచుకుంటాడు.

  • Written By:
  • Updated On - November 4, 2021 / 12:24 AM IST

రాజ‌కీయాలకు ఏదీ అతీతం కాదు..న‌రేంద్ర మోడీ ఏ చిన్న విష‌యాన్నైనా అనుకూలంగా మ‌లుచుకుంటాడు. ఇటీవ‌ల వాటిక‌న్ సిటీలోని పోప్ ఫ్రాన్సిస్ ను క‌లిసిన అంశాన్ని ప్ర‌చారంలోకి తీసుకొస్తున్నాడు. వ్యాక్సినేష‌న్ కు, పోప్ భేటీకి మోడీ ముడిపెట్టేశాడు. వ్యాక్సినేష‌న్ పై ఉన్న అపోహ‌లు పోవాలంటే మ‌త పెద్ద‌ల స‌హ‌కారం తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు హిత‌బోధ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ సంద‌ర్భంగా పోప్ తో భేటీ అయిన విష‌యాన్ని మోడీ కోడ్ చేయ‌డం ఒక పొలిటిక‌ల్ లాజిక్‌.

Also Read : దేశంలో మ‌స‌క‌బారుతోన్న బీజేపీ ప్ర‌భ‌..ఉప ఫ‌లితాల్లో క‌మ‌ల‌నాథుల ఢీలా

దేశ వ్యాప్తంగా 40 జిల్లాల ప‌రిధిలో వ్యాక్సినేష‌న్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని కేంద్రం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్లపై పలు ర‌కాలు అనుమానాలు ఉన్నాయి. వాటిని తొల‌గించ‌క‌పోతే, రాబోవు రోజుల్లో దేశం మ‌రోసారి కోవిడ్ సంక్షోభంలో చిక్కుకునే ప్ర‌మాదం ఉంది. ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయ‌డం, రెండో డోస్ కోసం ప్ర‌జ‌ల‌ను ఉత్సాహ‌ప‌ర‌చ‌డం కోసం ప్ర‌ధాని మోడీ ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్ మీటింగ్ పెట్టాడు. ఆ సంద‌ర్భంగా మ‌త పెద్ద‌ల అంశాన్ని నొక్కి చెప్ప‌డం ఆశ్చ‌ర్యం.

Also Read : మాస‌న‌స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లే వారికి గుడ్ న్యూస్

కోవిడ్ -19 వ్యాక్సినేష‌న్ విజ‌య‌వంతానికి మ‌త పెద్ద‌ల స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భావించాడు. సెకండ్ వేవ్ మాదిరిగా మూడో వేవ్ బీభ‌త్సం సృష్టించ‌కుండా ఉండాలంటే వ్యాక్సినేష‌న్ గ్రామ స్థాయికి ప‌గ‌డ్బందీగా వెళ్లాల‌ని ఆయ‌న ఉవాచ‌. ఆ మేర‌కు దేశంలోని సుమారు 40జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. మ‌త పెద్ద‌ల సహాయం లేకుండా వ్యాక్సినేష‌న్ విజ‌య‌వంత కాద‌ని ఆయ‌న అభిప్రాయం. రెండో డోస్ వ్యాక్సినేష‌న్ పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌డానికి ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించాల‌ని సూచించారు. ప్రాంతీయ స్థాయిలో వివిధ రంగాల‌కు చెందిన వాళ్ల‌తో క‌మిటీల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సినేష‌న్ మీద అవ‌గాహ‌న పెంచాల‌ని మోడీ ఆదేశించారు.
వందేళ్ల త‌రువాత వ‌చ్చిన ఇలాంటి వైర‌స్ ను ఎదుర్కోవ‌డం ఈజీగా కాద‌ని మోడీ హెచ్చ‌రించాడు. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న విష‌యంలో అనుభ‌వం గ‌డించిన ఆశా వ‌ర్క‌ర్ల ప్ర‌స్తావ‌న ఆయన తెచ్చాడు. గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేష‌న్ చేయాల‌ని ఆదేశించాడు. వినూత్నంగా ఆలోచించ‌డం ద్వారా వ్యాక్సినేష‌న్ ను 100శాతం చేయించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించాడు మోడీ. అంటే, మూడో వేవ్ భ‌యం సంకేతాలు మొద‌ల‌య్యాయ‌ని స్ప‌ష్టం అవుతోంద‌న్న‌మాట‌.