Attack On ED Team : ఈడీ టీమ్‌పై 200 మంది దాడి.. ఇద్దరు ఆఫీసర్లకు గాయాలు

Attack On ED Team : పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలకు చెందిన రెండు వాహనాలపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Attack On Ed Team

Attack On Ed Team

Attack On ED Team : పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలకు చెందిన రెండు వాహనాలపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రేషన్ కుంభకోణం కేసులో సందేశ్‌ఖాలీలోని సర్బేరియా ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ నివాసంలో సోదాలు చేయడానికి వెళ్లిన ఈడీ అధికారులపై దాదాపు 100 నుంచి 200 మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈడీ అధికారులు వెళ్లిన టైంలో షాజహాన్ షేక్ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో అతడి ఇంటి తలుపులను పగులగొట్టేందుకు అధికారులు యత్నించారు. ఈక్రమంలో ఒక్కసారిగా నలువైపుల నుంచి వందలాదిగా దూసుకొచ్చిన జనం ఈడీ ఆఫీసర్లపై, వారి వాహనాలపై దాడికి తెగబడ్డారు. జనం వందలాదిగా ఉండటంతో అక్కడున్న అతికొద్ది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఏమీ చేయలేక చూస్తుండి పోయారు. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు 8 మంది ఈడీ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఈడీ అధికారులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఒక అధికారి తలకు తీవ్ర గాయమైందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని  ఆయన ఆరోపించారు. ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న నాయకులపై ఈడీ రైడ్స్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఈడీపై జరిగిన దాడి.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు రోహింగ్యాలు భంగం కలిగిస్తున్నారనేందుకు సాక్ష్యమని పేర్కొంది. మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్‌ను ఎంత అరాచకంగా పాలిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని సుకాంత మజుందార్(Attack On ED Team) చెప్పారు.

Also Read: Cargo Ship Hijack : 15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్.. రంగంలోకి నేవీ

  Last Updated: 05 Jan 2024, 01:56 PM IST