CBSE Paper Issue : వివాదంలో ‘సీబీఎస్ఈ’ ప‌శ్నాప‌త్రం

సీబీఎస్ఈ ఇంగ్లీషు,సోష‌యాల‌జీ పేప‌ర్ వివాద‌స్ప‌దం అయింది. 10 త‌ర‌గ‌తి ఇంగ్లీషు ప్ర‌శ్న‌ప‌త్రంలోని ఒక ప్యాసేజ్ లింగ స‌మాన‌త్వాన్ని ప్ర‌శ్నించేలా ఉంది. తిరోగ‌మ‌న భావాల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా ఉంది. ఆ విష‌యాన్ని ఎత్తిచూపుతూ రాహుల్‌, ప్రియాంక‌గాంధీ ట్వీట్ చేశారు. మోడీ స‌ర్కార్ వాల‌కాన్ని ఆ ట్వీట్ లో ప్ర‌శ్నించారు.

  • Written By:
  • Updated On - December 13, 2021 / 03:29 PM IST

సీబీఎస్ఈ ఇంగ్లీషు,సోష‌యాల‌జీ పేప‌ర్ వివాద‌స్ప‌దం అయింది. 10 త‌ర‌గ‌తి ఇంగ్లీషు ప్ర‌శ్న‌ప‌త్రంలోని ఒక ప్యాసేజ్ లింగ స‌మాన‌త్వాన్ని ప్ర‌శ్నించేలా ఉంది. తిరోగ‌మ‌న భావాల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా ఉంది. ఆ విష‌యాన్ని ఎత్తిచూపుతూ రాహుల్‌, ప్రియాంక‌గాంధీ ట్వీట్ చేశారు. మోడీ స‌ర్కార్ వాల‌కాన్ని ఆ ట్వీట్ లో ప్ర‌శ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఆ ప్ర‌శ్నాప‌త్రంలో చొప్పించార‌ని ఆరోపించారు. అంతేకాదు, ఈ నెల ప్రారంభంలో, CBSE క్లాస్ 12 సోషియాలజీ పేపర్ లోని అంశాన్ని కూడా లేవ‌నెత్తారు. “2002లో గుజరాత్‌లో ముస్లిం వ్యతిరేక హింస” ఏ పార్టీ కింద జరిగిందో చెప్పమని ఒక ప్రశ్న ఉండ‌డాన్ని కాంగ్రెస్ త‌ప్పుబడుతోంది. సీబీఎస్ ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌శ్నా ప‌త్రాలు ఉన్నాయ‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా రాహుల్‌, ప్ర‌యాంక ఆగ్ర‌హించారు.త‌ల్లిదండ్రుల అధికారాన్ని మ‌హిళ‌లు నాశ‌నం చేస్తున్నార‌న్న భావ‌న‌తో సీబీఎస్ఈ ఇంగ్లీషు ప్ర‌శ్నాప‌త్రంలో ప్యాసేజ్ ఉంది. భ‌ర్త మార్గాన్ని త‌ల్లి అనుస‌రించాల‌ని ఆ పాసేజ్ లోని సారాంశం. దీనితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు, ఈ పాసేజ్ “అసహ్యకరమైనది” అని రాహుల్ ట్వీట్ చేశాడు. సీబీఎస్ ఈ ఇచ్చిన ఈ పాసేజ్ ను ఉప‌సంహ‌రించుకుని క్ష‌మాప‌ణ చెప్పాల‌ని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేయ‌డంతో వివాదం నెల‌కొంది.కొంద‌రు స్వేచ్ఛ‌గా ఉండే మ‌హిళ‌ల కార‌ణంగా త‌ల్లిదండ్రులు అధికారాన్ని కోల్పోతున్నార‌ని ఇచ్చిన ఆ పాసేజ్ మీద సీబీఎస్ఈ బోర్డు కూడా స్పందించింది. దీనిపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తున్నందున‌, జ‌వాబు ప‌త్రాల‌ను ప‌రిశీలించిన‌ త‌రువాత తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. మొత్తం మీద సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రాల‌ను కూడా రాజ‌కీయంగా వాడుకోవ‌డం శోచ‌నీయం.