Site icon HashtagU Telugu

Elon Musk – India : జనాభా ఎక్కువున్నా ఇండియాను పట్టించుకోరా.. ఐక్యరాజ్యసమితికి మస్క్ ప్రశ్న

Elon Musk Returns

Elon Musk Returns

Elon Musk – India : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఎక్స్ (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు నేటికీ శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం అసంబద్ధమైన అంశమన్నారు. ఐక్యరాజ్య సమితి సంస్థల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను, నిర్మాణ స్వరూపాన్ని పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘సమస్య ఏమిటంటే.. ఎక్కువ శక్తి కలిగిన దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్‌కు కూడా సెక్యూరిటీ కౌన్సిల్‌లో అవకాశం దక్కాల్సిందే. ఆఫ్రికా ఖండానికి సమష్టిగా ఒక స్థానాన్ని కేటాయించాలి’’ అని మస్క్(Elon Musk – India) తన సొంత సోషల్ మీడియా సైట్  X లో ఓ పోస్ట్‌ పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

వెంచర్ క్యాపిటలిస్ట్, రచయిత మైఖేల్ ఐసెన్‌బర్గ్ చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్‌పై స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మైఖేల్ ఐసెన్‌బర్గ్  తన పోస్టులో ఇండియాను సపోర్ట్ చేశారు. ఐక్యరాజ్యసమితిని పునర్ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేటి పరిస్థితులు, వాస్తవాలకు అనుగుణంగా ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయాలని కోరారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని లేవనెత్తారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్‌ను వినిపించారు.

Also Read:BRS New Plan : లోక్‌సభ పోల్స్‌కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?

మస్క్ రోబోట్ ఏం చేసిందంటే..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన టెస్లా ఆప్టిమస్ రోబోట్ కొత్త వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అందులో రోబో టీషర్ట్ మడపపెడుతూ కనిపించింది. వీడియోలో రోబోట్ టేబుల్ ముందు నిలబడి ఉంది. అందులో ఒక వైపు ఉన్న బుట్టలో నుంచి హ్యూమనాయిడ్ నలుపు రంగు టీ షర్టును తీసి టేబుల్‌పై ఉంచింది. ఆ తర్వాత రోబోట్ టీ షర్టును నెమ్మదిగా మడవటం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన పలువురు గ్రేట్ అని కామెంట్లు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఇంకా ఆ రోబోట్ టీ షర్టును సరిగ్గా మడతపెట్టడం లేదని కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ వీడియోను జనవరి 16న సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా..69.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు రెండు లక్షల ఆరు వేల మందికిపైగా దీనిని లైక్ కూడా చేశారు. 36 వేల మందికిపైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఎలాన్ మస్క్(Elon musk) షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read:BRS New Plan : లోక్‌సభ పోల్స్‌కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?