Site icon HashtagU Telugu

Supreme Court : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రద్దు – సుప్రీం తీర్పు వెల్లడి

Electoral Bonds Are Unconst

Electoral Bonds Are Unconst

ఎలక్ట్రోరల్ బాండ్స్ (Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. వీటి అమ్మకాలపై నిషేధం విధించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని SBIని ఆదేశించింది. అలాగే మార్చి 31లోగా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని ఈసీకి తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై కోర్టు తీర్పును వెలువ‌రించింది. బ్లాక్ మ‌నీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు అని కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, బీఆర్ గ‌వాయి, జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాలు ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. ధ‌ర్మాస‌నంలోని స‌భ్యుల మ‌ద్య రెండు అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నాతో పాటు తాను కూడా ఒకే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు సీజేఐ తెలిపారు. స‌రైన ఓటింగ్ ప్ర‌క్రియ‌ను తెలుసుకునేందుకు రాజ‌కీయ నిధుల గురించి స‌మాచారం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీజేఐ అన్నారు. ఆర్టిక‌ల్ 19(ఏ)(ఏ) (Article 19(1)(a)) ప్ర‌కారం స‌మాచార హ‌క్కును ఉల్లంఘించిన‌ట్లు అవుతుంది.

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని సీజేఐ చంద్ర‌చూడ్ తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చ‌ట్టంలో 29(1)సెక్ష‌న్ స‌వ‌ర‌ణ రాజ్యాంగ వ్య‌తిరేకం అవుతుంద‌న్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేసే బ్యాంకులు త‌క్ష‌ణ‌మే బాండ్ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొంది.

Read Also : Robbery in Hyderabad : యూపీ తరహాలో పట్టపగలే హైదరాబాద్‌ బంగారం షాప్‌లో దోపిడీ