Lottery King No 1 : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలను అందించిన లిస్టులో ఆయన నంబర్ 1 ప్లేస్‌లో నిలిచాడు. ఎవరూ ఊహించనంత రేంజులో ఆయన 2019 నుంచి 2024 వరకు రాజకీయ పార్టీలపై విరాళాల వర్షం కురిపించారు. గత ఐదేళ్లలో ఆ ఒక్క వ్యక్తే తన కంపెనీల ద్వారా రాజకీయ పక్షాలకు రూ.1368 కోట్ల విరాళాలను అందించారు. ఈవిషయాన్ని తెలుసుకొని దేశమంతా షాక్ అయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది ? ఆయన పేరే.. శాంటియాగో మార్టిన్ (Lottery King No 1)!! మార్టిన్‌ను లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
శాంటియాగో మార్టిన్ ఎవరు?
- శాంటియాగో మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఆయన మయన్మార్‌లోని యాంగూన్‌లో సాధారణ కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు.
- 1988లో ఇండియాకు తిరిగొచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
- తదుపరిగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు లాటరీ వ్యాపారాన్ని విస్తరించారు.
- ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు కూడా లాటరీ వ్యాపారాన్ని విస్తరించారు.
- ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ లాటరీ పథకాలను నిర్వహించడం ద్వారా తన వ్యాపారాన్ని శాంటియాగో మార్టిన్ పెంచుకున్నాడు.
- భూటాన్, నేపాల్‌లలో సంస్థలను ప్రారంభించడం ద్వారా ఇతర వ్యాపారాల్లోకి కూడా లాటరీ వ్యాపారాన్ని విస్తరించాడు.
- లాటరీ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగు మోపాడు.
- లాటరీ వ్యాపారం చేయడానికి శాంటియాగో మార్టిన్ ఏర్పాటు చేసిన కంపెనీ పేరు ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’..
- ఈ కంపెనీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూ.1368 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది.
Also Read : BJP 6060 Crores : రూ.12వేల కోట్లలో రూ.6వేల కోట్లు బీజేపీకే.. ప్రముఖ కంపెనీల విరాళాలు ఎంత ?
ఈడీ, సీబీఐ టార్గెట్‌లో..
రాజకీయ పార్టీలకు ఇంత భారీగా విరాళాలు ఇస్తూ వచ్చిన శాంటియాగో మార్టిన్‌ను ఈడీ టార్గెట్‌గా ఎంచుకుంది. మనీ లాండరింగ్ చట్టాన్ని ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ఉల్లంఘించిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈవిషయంలో ఈడీ 2019 నుంచే దర్యాప్తు చేస్తోంది. 2023 మేలో కోయంబత్తూరు, చెన్నైలలోని ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. సిక్కిం ప్రభుత్వం నుంచి పొందిన లాటరీలను.. కేరళలో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ విక్రయించిందని ఆరోపిస్తూ సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. 2009 ఏప్రిల్ నుంచి 2010 ఆగస్టు వరకు ప్రైజ్ విన్నింగ్ టికెట్ల క్లెయిమ్ ను పెంచడం వల్ల మార్టిన్, ఆయనకు చెందిన కంపెనీలు సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం కలిగించాయని ఈడీ ఆరోపించింది.