ముందస్తు దిశగా కేంద్రం (Elections Prepone) ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పలుమార్లు నరేంద్ర మోడీ చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మోడీ గతంలోనే విపక్షాలతో సమావేశాన్ని నిర్వహించారు. మరోసారి ఆగస్ట్ లో అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించడానికి సిద్దమయ్యారు. అందుకే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ముందస్తుకు క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
ముందస్తు దిశగా కేంద్రం ఆలోచన.(Elections Prepone)
వాస్తవంగా తెలంగాణ, చత్తీస్ గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు డిసెంబర్ లోపు జరపాలి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించాల్సి ఉంది. మొత్తంగా దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల నాటికి నిర్వహించాలి. అందుకే, ఈ ఏడాది నిర్వహించాల్సిన రాష్ట్రాల ఎన్నికలను వెనక్కు జరపడం, వచ్చే ఏడాది ఎన్నికలు జరపాల్సిన రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకురావడం చేస్తే, దేశంలోని సగం రాష్ట్రాలకు దాదాపుగా లోక్ సభతో పాటు పోలింగ్ ఉంటుంది. అందుకే, లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా (Elections Prepone) నిర్వహించడానికి కసరత్తు జరుగుతోందని ఢిల్లీ వర్గాల్లోని టాక్.
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయంగా
ఈనెల 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశం జరగనుంది. ఆ తరువాత అఖిపక్ష సమావేశాన్ని మోడీ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తరువాతగానీ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. అంతకంటే ముందుగా ఎన్డీయే పక్షాల మీటింగ్ ను ఈనెల 18న నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని భాగస్వామ్య పక్షాలకు పంపారు. అంతేకాదు, మునుపటి భాగస్వామ్యం పార్టీలకు కూడా ఆహ్వానం అందించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తటస్థగా ఉన్న టీడీపీ, అకాలీదళ్ కూడా ఆహ్వానాలను అందుకున్నట్టు సమాచారం. అంటే, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ ..
తెలుగుదేశం పార్టీ వైపు బీజేపీ చూస్తోంది. ఎన్డీయేలో భాగస్వామిగా టీడీపీని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో ఈనెల 18వ తేదీన ఢిల్లీ కేంద్రంగా జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సందర్భాల్లో నరేంద్ర మోడీని మాజీ సీఎం చంద్రబాబు కలిశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మోడీ, చంద్రబాబు కరచాలనం చేసుకున్నారు. ఆ తరువాత జీ 20 దేశాల ప్లానింగ్ లోనూ మోడీతో భాగస్వామ్యం అయ్యారు. తాజాగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తే, రాబోవు ఎన్నికలకు బీజేపీ, టీడీపీ కలిసి వెళతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, ముందస్తుకు (Elections Prepone) సిద్ధం కావాలని మోడీ పిలుపునిచ్చే అవకాశం ఉంది.
Also Read : KCR-Modi: మోడీ టూరుకు మళ్లీ డుమ్మా!
వరంగల్ జిల్లా వేదికగా శనివారం జరిగిన మోడీ సభ ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఒక వైపు వరాలు మరో వైపు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి మీద విరుచుకుపడ్డారు. నాగ్ పూర్, తెలంగాణ ఫైనాన్షియల్ కారిడార్ ప్రాముఖ్యతను వివరించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం కీలకమని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలోని ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శించారు. ఆయన దూకుడు ప్రసంగాన్ని గమనిస్తే, ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోంది.