Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.

  • Written By:
  • Updated On - January 30, 2022 / 09:40 AM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది. ఆ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేసింది. వ్యవసాయ చట్టాలు తెచ్చిన బీజేపీ మీద బాగా యాంటీ ఉందని తేల్చింది. ఈసారి ముస్లింలు 90శాతం ఎస్పీ వైపు ఉన్నారని తేల్చింది. ఇక ధరల పెరిగిన అంశం కూడా ఫలితాలపై ప్రభావం చూపనుంది.

వెరసి బీజేపీ ఆశ పెట్టుకున్న యూపీ రాష్ట్రాన్ని యోగి నుంచి జారనుంది. ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వే తేల్చింది. ఆప్ రెండో ప్లేస్ లో నిలవనుంది. అక్కడ బీజేపీ ప్రభావం ఏమీ లేదని తేల్చింది. గోవా , ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ కి అవకాశం లేదని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగ నుందని సర్వేలో తేలింది.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలు విధించింది. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 7వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాలని ఈసీ స్పష్టం చేసింది. సో..ఈ ఫలితాలు బీజేపీ కి ప్రతికూలంగా ఉంటాయని ఆత్మసాక్షి సర్వే చెబుతుంది.

PUNJAB

 

Uttar Pradesh