Election Survey: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారో క్లియర్ పిక్చర్ మీకోసం

దేశంలో మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఆయన్ని గద్దె దించుతారని ప్రతిపక్షాలు చెపుతోన్నా తాజాగా చేసిన సర్వేలు మాత్రం మోదీకే పాజిటివ్ గా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - November 14, 2021 / 08:08 AM IST

దేశంలో మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఆయన్ని గద్దె దించుతారని ప్రతిపక్షాలు చెపుతోన్నా తాజాగా చేసిన సర్వేలు మాత్రం మోదీకే పాజిటివ్ గా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీ ఓటర్ సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాలను చూసి ప్రతిపక్షాలు తలలుపట్టుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,మణిపూర్,గోవా రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయనుందని సీ ఓటర్ సర్వే తేల్చింది.

పంజాబ్ లో రైతుల ఉద్యమం దృష్ట్యా బీజేపీ ప్లాప్ అవుద్దని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ హవా ఉంటుందని సర్వే అంచనా వేసింది. ఆప్ 51-57 సీట్లు,కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది.

యూపీలో బీజేపీకి సీట్లు తగ్గినా బీజేపీ జెండానే ఎగురుతుందని సర్వేలో తేలింది. 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 259-267 సీట్లు,
సమాజ్ వాదీ పార్టీ 109 – 117 సీట్లు, బహుజన్ సమాజ్ పార్టీ 12 – 16 సీట్లు, కాంగ్రెస్ కేవలం 3 – 7 సీట్లకు పరిమితమవుతుందని అంచనా.

మణిపూర్‌లోనూ బీజేపీ విజయం ఖాయమని సర్వేలో తేలింది. బీజేపీకి 32 -36 సీట్లు, కాంగ్రెస్‌ 18 -22 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 46, కాంగ్రెస్ 21 , ఆప్ 2 సీట్లు గెలుచుకుంటుందni అంచనా వేసింది.ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.

గోవాలోనూ బీజేపీకే ఛాన్స్ ఉందని, అక్కడ బీజేపీకి 22 – 26 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 – 8 సీట్లు,కాంగ్రెస్‌‌కు 3 – 7 సీట్లు వస్తాయని అంచనా.

మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పారు. బీజేపీ మరికొన్ని దఫాలు అధికారంలో ఉంటుంది. బీజేపీతో పోటీపడగలిగే పార్టీ లేదని, బీజేపీని ఢీకొట్టే స్థాయి కాంగ్రెస్ కి ఇప్పుడు లేదని అన్నారు.