Election Note : ఎన్నిక‌ల వేళ 2వేల నోటుకు మూడింది.!

ఎన్నిక‌లు వేళ రూ. 2వేల నోటు ర‌ద్దు(Election Note) ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 24, 2022 / 04:47 PM IST

ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ రూ. 2వేల నోటు ర‌ద్దు(Election Note) ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నోట్ల ర‌ద్దు కూడా 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌రిగింది. ఆనాడు 2017లో జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు నోట్ల ర‌ద్దు త‌రువాత జరిగాయి. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ(BJP) హ‌వా కొన‌సాగింది. డ‌బ్బు పంపిణీ ద్వారా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి అవ‌కాశం లేకుండా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై నోట్ల ర‌ద్దు ప‌నిచేసింద‌ని ఆనాడు అనుకున్నారు. కానీ, రూ. 2వేల నోటును ప‌రిమితంగా విడుద‌ల చేయాల‌న్ని కాంగ్రెస్ తో స‌హా విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆనాడు విడుద‌ల చేసిన 2వేల నోట్లు ఇప్పుడు క‌నిపించ‌డంలేదు. వాటిని ర‌ద్దు చేస్తార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది.

విడుద‌ల చేసిన 2వేల నోట్లు(Electon Notes)

దేశ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తాజాగా వినిపిస్తోంది. ముంద‌స్తుకు మోడీ వెళ్లే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, రూ. 2వేల నోటు(Election Note) కూడా ఎన్నిక‌ల ముందుగా ర‌ద్దు అయ్యే అవ‌కాశం లేక‌పోలేద‌ని మోడీ, షా ద్వ‌యం ఎత్తుగ‌డ‌లు తెలిసిన వాళ్లు వేస్తోన్న అంచ‌నా. ఇటీవ‌ల జ‌రిగిన శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ 2వేల నోటు ర‌ద్దు అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కనీసం రెండేళ్ల పాటు మార్పున‌కు గ‌డువు ఇస్తూ ర‌ద్దు చేయాల‌ని విప‌క్షాల సూచ‌న‌గా ఉంది. డ్రగ్స్ దిగుమతి, మనీ లాండరింగ్ కోసం ఆ నోట్లు ప‌నికొస్తున్నాయని, ర‌ద్దు చేయాల‌ని బీజేపీ(BJP_ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ కోరారు. డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు చలామణి 2016 కంటే భారీగా పెరిగడాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

2016 నవంబర్ 8 వ తేదీన వెయ్యి రూపాయలు, ఐదొందల నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తీసుకొచ్చిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం వెయ్యి రూపాయాల నోటు మార్కెట్ లో లేదు. ఆ డినామినేష‌న్ తీసుకొస్తూ 2వేల నోటును ర‌ద్దు చేస్తార‌ని ప్ర‌చారం జరుగుతోంది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా డాల‌ర్ మాదిరిగా రూపాయికి గుర్తింపు వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైయింది.

లావాదేవీలు భార‌త రూపాయితో 

ఆర్థిక సంక్షోభంతో ఉన్న దేశాల్లో ఆర్థిక లావాదేవీలు భార‌త రూపాయితో జరిపేందుకు వీలుగా ఆర్ బీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్ దేశాలతో ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు మార్గం సుగమైంది. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్త, క‌జకిస్తాన్, క్యూబా, లగ్జెంబర్గ్ , సూడాన్, గల్ఫ్ , ఆఫ్రికన్ దేశాల్లోనూ భార‌త రూపాయితోనే చెల్లింపులు జరిపే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. వీలైన‌న్ని ఎక్కువ దేశాల్లో చెల్లింపులు జరిపేందుకు వీలుగా రూపాయి మార‌క విధానాన్ని మార్చాలని కేంద్రం భావిస్తోంది. డాల‌ర్ మీద ఆధార‌ప‌డ‌కుండా అంత‌ర్జాతీయంగా ఇండియ‌న్ రూపీని మార‌క ద్ర‌వ్యంగా మార్చ‌డానికి మోడీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది.

Also Read : Digital Currency : నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్న RBI.!!

అమెరికా డాల‌ర్ డినామినేష‌న్ గ‌మ‌నిస్తే అత్య‌ధికంగా 100 డాల‌ర్ల నోటు మాత్ర‌మే ఉంది. కానీ, ఇండియ‌న్ క‌రెన్సీ అత్య‌ధిక నోటు 2వేలు ఉంది. దీన్ని ర‌ద్దు చేయ‌డం ద్వారా బ్లాక్ మ‌నీ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని మోడీ స‌ర్కార్ భావిస్తోంది. అంతేకాదు, రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో డబ్బు పంపిణీకి తెగ‌బ‌డ‌కుండా 2వేల నోటును ర‌ద్దు చేయ‌క త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు. అటు అంతర్జాతీయ ఇండియ‌న్ రూపీని బ‌లోపేతం చేయ‌డం ఇటు ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీ అరిక‌ట్టే క్ర‌మంలో 2వేల నోటు ర‌ద్దు త‌ప్ప‌దంటున్నారు.