Gujarat Assembly Elections : నేడు గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించనున్న ఈసీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం...

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 08:37 AM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్‌ను ఈరోజు ఆల్ ఇండియా రేడియోలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో ప్రకటించనున్నారు. ఈసీ వర్గాల సమాచారం ప్రకారం గుజరాత్‌లో డిసెంబర్ మొదటి వారంలో రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజ‌రాత్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగవచ్చు. గుజరాత్‌లో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఆ సమయంలో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. గతసారి రాష్ట్ర అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను కాషాయ పార్టీ 99 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఎన్నికలు అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీగా మారనున్నాయి. బీజేపీ నాయకులు గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకోగలమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గుజ‌రాత్‌ని కైవ‌సం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.