Site icon HashtagU Telugu

EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం

EVM Hacking

EVM Hacking

EVM Hacking: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్‌ బంధువుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి. ఈవీఎంలపై ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి. కాగా ప్రతిపక్ష నేతల ఆరోపణలపై ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చింది. ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల నేతలందరి ఆరోపణలను ఎన్నికల సంఘం పూర్తిగా తోసిపుచ్చింది. ఈవీఎంలను ఎలాంటి ఓటీపీతో అన్‌లాక్ చేయలేమని లేదా ఏ పరికరానికి కనెక్ట్ చేయలేమని ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ మాట్లాడుతూ.. ఈవీఎంలకు సంబంధించి ఈరోజుల్లో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఏ ఓటీపీతోనూ అన్‌లాక్ చేయదానికి కుదరదు. ఇది మాత్రమే కాదు, ఈవీఎం ఏ పరికరానికి కనెక్ట్ చేయబడదు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇదొక స్టాండ్ ఎలోన్ సిస్టమ్, దీనిని తారుమారు చేయలేము. ఈవీఎంలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై నోటీసులు జారీ చేశామన్నారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 499 కింద పరువు నష్టం కేసు కూడా నమోదు చేశారు.

రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిని ఒప్పించేందుకు నేను కూడా ప్రయత్నించానని, అయితే వారు వినలేదని అన్నారు. ఇప్పుడు వారికి 505 IPC మరియు 499 IPC కింద నోటీసులు పంపించామని ఆయన అన్నారు.

Also Read: Health: పిల్లలకు పౌడర్ వాడుతున్నారా.. ఈ తప్పు చేయకండి