LS Polls 2024 : మీమ్స్‌ను ఎన్నికల సంఘం కూడా వదట్లేదు.. ‘జల్దీ ఆవో సిమ్రాన్‌’ అంటూ పోస్ట్‌..!

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల 2024 తేదీలను ప్రకటించారు. ఈ సారి లోక్‌ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయి, ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది.

  • Written By:
  • Publish Date - April 14, 2024 / 09:01 PM IST

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల 2024 తేదీలను ప్రకటించారు. ఈ సారి లోక్‌ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయి, ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 13న, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికలు ఏప్రిల్ 19న, ఒడిశా ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 412, ఎస్టీ అభ్యర్థులకు 47, ఎస్సీ అభ్యర్థులకు 84 సీట్లు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన సిద్ధాంతాలు, మీమ్స్ , వీడియోలతో హోరెత్తుతోంది. భారత ఎన్నికల సంఘం ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యొక్క సీజన్ 2 నుండి దృశ్యాలను కలిగి ఉన్న మీమ్‌ను పంచుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఫోటో.. మనోజ్ బాజ్‌పేయి పాత్ర లంచ్ ఆహ్వానాన్ని తిరస్కరించడం కనిపిస్తుంది. ఎలక్షన్‌ డే రోజు డేట్‌కు పిలివడంతో.. తాను రాను అనే విధంగా ఉన్న మీమ్‌ను పంచుకుంటూ.. ‘ఠైరో జరా !! ఆజ్ కరేంగే మతదాన్, కల కరేంగే జలపాన్ (ఈ రోజు మనం ఓటే వేద్దాం.. రేపు లంచ్‌కి వెళ్దాం) అనే అర్థం వచ్చేలా మీమ్‌ను ప్రజల్లోకి వదిలారు. అయితే.. ప్రతి సారి ఎన్నికల వేళ ప్రజలను పోలింగ్‌ బూత్‌లకు తీసుకువచ్చేందుకు అనేక విధాలుగా ప్రకటనలను ఇస్తుంది ఎన్నికల సంఘం ఈ సారి కొంచెం కొత్తగా.. ట్రెండీగా ఉండేలా.. ప్రజలకు సైతం త్వరగా రీచ్‌ అయ్యే విధంగా మీమ్స్‌తో ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తోంది.

అయితే.. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మీమ్‌ను పంచుకుంది ఎన్నికల సంఘం… ప్రముఖ బాలీవుడ్‌ హీరీ షారుఖ్‌ఖాన్‌, అందాల తార కాజోల్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ.. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (DDLJ)లో హీరో ట్రైన్‌లో నుంచి హీరోయిన్‌కు చేయి అందిస్తూ సీన్‌ ఫోటోపై జల్దీ ఆవో సిమ్రాన్‌.. ఓట్‌ దాల్నే ఘర్‌ జానా హై (త్వరగా రా సిమ్రాన్‌.. ఓటు వేసేందుకు ఇంటికి వెళ్లాలి) అనే అర్థం వచ్చే మీమ్‌ను పంచుకున్నారు. అంతేకాకుండా.. రాజ్ – సిమ్రాన్ కూడా ఓటు వేయబోతున్నారు.! మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? చలో మతదాన్ కరెం హమ్ అనే కాప్షన్‌ను కూడా జోడించింది ఎన్నికల సంఘం. అయితే.. ఈ మీమ్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.
Read Also : LS Polls 2024 : ఏ రాష్ట్రంలో 85 ఏళ్లుదాటిన ఓటర్లు ఎక్కువో మీకు తెలుసా..?