Site icon HashtagU Telugu

Election Commission: 6 రాష్ట్రాల హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌ను తొల‌గించిన ఈసీ

Election Gazette Notification Released for Teacher MLC Post of Both Godavari Districts

Election Commission

 

Election Commission : లోక్‌స‌భ ఎన్నిక‌ల(Lok Sabha Elections) నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Central Election Commission) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరు రాష్ట్రాల(6-states) హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌(home-secretaries)ను తొల‌గిస్తూ(removal) ఉత్త‌ర్వులు జారీ చేసింది. గుజ‌రాత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్, జార్ఖండ్‌, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ హోం శాఖ కార్య‌ద‌ర్శుల‌ను ఈసీ తొల‌గించింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొల‌గించింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చాక ఈసీ తొలిసారి చ‌ర్య‌లు తీసుకుంది. బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ అధికారుల‌పైనా కూడా ఈసీ వేటు వేసింది. బీఎంసీ క‌మిష‌న‌ర్, అద‌న‌పు, డిప్యూటీ క‌మిషన‌ర్ల‌ను ఈసీ తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. 2024 జూన్ 16న 17వ లోక్‌సభ కాలం ముగియనుందని తెలిపారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ వివరించారు.

read also: Pithapuram : పిఠాపురం లో టీడీపీ క్యాడర్ పై జనసేన క్యాడర్ దాడి ..