ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖాండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చు 3, 7 న నిర్వహించనున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు. 18. 3 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను 7 ఫేసులలో నిర్వహించనున్నారు. ఫలితాలను మర్చి 10న ప్రకటించనున్నారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 15వరకు అన్ని ర్యాలీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా.. జనవరి 15 తర్వాత ర్యాలీలు నిర్వహణ పై కోవిడ్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. చివరి ఎన్నికల తేదీ వరకు కూడా రాత్రి 8గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ప్రచారం నిర్వహించడానికి అనుమతులను రద్దు చేశారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ, హోంశాఖ అభిప్రాయాలు కూడా తీసుకున్నామని.. డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించాం అని అన్నారు. 2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తాం అని సుశీల్ చంద్ర తెలిపారు.
గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి రూ. 28 లక్షలు, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు గా నిర్ణయించారు. డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతుల రవాణా జరగకుండా చూడాలని సదరు ప్రభుత్వ సంస్థలనూ ఆదేశించాం అని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనలు, అక్రమాలను ఎవరైనా సరే నేరుగా రిపోర్ట్ చేయవచని.. కేవలం 100 నిమిషాల్లో చర్యలు చేపడతామని అని ఎన్నికల ప్రధాన కార్యదర్శి సుశీల్ చంద్ర అన్నారు.