Site icon HashtagU Telugu

Eknath Shinde Health : సీఎం ఏక్నాథ్ శిండే ఆరోగ్యం విషమం ..?

Eknath Shinde Health Update

Eknath Shinde Health Update

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే ఆరోగ్యం (Eknath Shinde Health) విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్నిరోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శనివారం థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిండే ఆరోగ్యం సంబంధిత సమాచారం ఇప్పటివరకు అధికారికంగా వెలువడలేదు. కానీ, ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. శిండే ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఏక్‌నాథ్‌ షిండేకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. కానీ శరీరంలో తెల్లకణాలు తగ్గడం వల్ల వాటికి చికిత్స చేస్తున్నారు. జ్వరం కారణంగా ఏకనాథ్ షిండే యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారు. అలాగే నిత్యం జ్వరం వస్తుండటంతో బలహీనపడుతున్నాడని డాక్టర్ తెలిపారు. శిండే ఆరోగ్య పరిస్థితి విషమమై ఉంటే, మహారాష్ట్రలో అధికారపరమైన మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు మహాకూటమి నేతల సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ హాజరవుతారని సమాచారం. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఈ సమావేశానికి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యే అవకాశాలు తక్కువ. మరోవైపు అజిత్ పవార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

మహరాష్ట్రలో ప్రభుత్వాన్నిచేసేందుకు బీజేపీ అధిష్టానం పకడ్బందీగా చేస్తోంది. మరోవైపు రేపు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర కమిటీలోని ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్,గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి అప్పగించారు. అయితే ఈ సమావేశానికి ముందుగానే విజయ్ రూపానీ దేవేంద్ర ఫడ్నవీస్ మహా సీఎం అవుతారని సన్నిహిత వర్గాలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈపరిణామాల నేపథ్యంలోనే ఏక్ నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి.

Read Also : Ration illegal transport : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్