Site icon HashtagU Telugu

Jharkhand Encounter : 8 మంది మావోలు మృతి

Jharkhand Encounter

Jharkhand Encounter

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు (Eight Naxals killed) హతమయ్యారు. ఇది మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బగా మారింది. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు (Central Reserve Police Force (CRPF)) ఆపరేషన్‌ నిర్వహించాయి.

Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో తిరుమలలో సమంత.. పెళ్లి వార్తలు..?

ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో వివేక్ (Vivek) అనే కీలక మావోయిస్టు నేత కూడా ఉన్నాడు. అతడిపై రూ. కోటి నగదు రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వివేక్ పలు రాష్ట్రాల్లో పోలీసులపై జరిగిన పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డ వ్యక్తిగా గుర్తించారు. అతడి మృతి మావోయిస్టుల శిబిరానికి పెద్ద లోటుగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్కౌంటర్ జరిగిన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించాయి. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర నిషిద్ధ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా అక్కడ మావోయిస్టుల కదిలాకులు ఉండే అవకాశం ఉన్నందున, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనతో జార్ఖండ్‌లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలుస్తోంది.