ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అందర్నీ ఆశ్చర్యానికి , షాక్ కు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా మరణించిన వారిని స్మశానానికి తీసుకెళ్లగా..వారు సడెన్ గా లేవడం, ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన వారు మళ్లీ చాలాకాలం తర్వాత తిరిగి రావడం..ఇలాంటివి మరెన్నో పలు విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తూ వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఇదే తరహా లో కర్ణాటక (Karnataka)లోని ధార్వాడ జిల్లాలో చోటుచేసుకుంది.
బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్ అనే దంపతులకు ఓ పండండి బాబు పుట్టాడు. పుట్టినప్పుడే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. భారీ ఖర్చు వెచ్చించి ఆ బాబుకి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో బాబు ను ఇంటికి తీసుకొచ్చారు. 8 నెలలు నిండిన తర్వాత ఆ బాబుకి మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.. ఆ బాబుకి శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోయింది.
దీంతో ఆ బాబు ను హుబ్లీలోని కిమ్స్ హాస్పటల్ లో చేర్పించారు. ఆ చిన్నారి (Eight month old boy ) పరిస్థితి విషమంగా ఉండటంతో.. డాక్టర్స్ ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్లి చికిత్స అందించారు. నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, పల్స్ రేట్ తక్కువ ఉందని, ఆక్సిజన్ తొలగిస్తే బిడ్డ బతకదని చెప్పారు. కాసేపు తర్వాత చిన్నారి చనిపోయిందని డాక్టర్స్ చెప్పడం తో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నియ్యారు. తల్లిదండ్రులతో సంతకం చేయించుకొని, శిశువు మృతదేహాన్ని అప్పగించారు. ఆ తర్వాత బాబు ను తీసుకొని సొంత గ్రామానికి వెళ్లి..వారి పద్దతుల ప్రకారం బాబు నోట్లో పసుపు నీరు పోశారు. అంతే వెంటనే బాబు తన చేతులు, కాళ్లను ఆడించారు. అది చూసిన తల్లిదండ్రుల సంతోషంతో ఆశ్చర్యపోయారు. చనిపోయిన తమ బిడ్డ మళ్లీ పుట్టాడంటూ సంబరాలు చేసుకున్నారు. మరో క్షణం ఆలస్యం చేయకుండా బాబుని నవలగుంద ఆస్పత్రికి తీసుకెళ్లగా.. హాస్పటల్ వైద్యురాలు 90 శాతం మేరకు బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పడం తో తల్లి దండ్రులు షాక్ లో పడ్డారు. ఈ ఘటన గురించి జిల్లా అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : AP : పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ పవన్ ఫై బొత్స ఫైర్