Site icon HashtagU Telugu

Corona Mafia : మ‌ళ్లీ విద్య‌, వైద్య దందా..స్టార్ట్‌.!

medical notification

Medical Mafia

కోవిడ్ 19 సంద‌ర్భంగా వివిధ రంగాలు ఆర్థికంగా చితికిపోయిన‌ప్ప‌టికీ మెడిక‌ల్, విద్య‌, సేవా రంగాలు మాత్రం ఖ‌జానాను భారీగా నింపుకున్నాయి. తొలి రోజుల్లో విద్యారంగం త‌డ‌బ‌డినప్ప‌టికీ ఆన్ లైన్ ప‌ద్ధ‌తికి జ‌నం అల‌వాటు ప‌డిన త‌రువాత ఆయా రంగాల యాజ‌మాన్యాలు భారీగా లాభ‌ప‌డ్డాయి. ఇప్పుడు మ‌ళ్లీ అదే దిశ‌గా ఆ రంగాలు దూసుకెళ్ల‌డానికి సిద్ధం అవుతున్నాయి. ఓమైక్రిన్ చేసే న‌ష్టాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో..ఇప్ప‌టి నుంచే వైద్య‌, విద్య‌, సాఫ్ట్ వేర్ రంగాలు ట్ర‌య‌ల్స్ వేస్తున్నాయ‌ట‌.మ‌రో రెండో వేవ్ పూర్తిగా కంట్రోలు లోకి రాకుండానే విద్యా రంగం దందాను ప్రారంభించింది. ఆయా స్కూల్స్, కాలేజిలు భారీగా అడ్మిష‌న్స్ ను చేసుకున్నాయి. ఫీజుల‌ను భారీగా వ‌సూలు చేశారు. మొద‌టి,రెండో వేవ్ లో ఆన్ లైన్ క్లాసులు పెట్టారు. కొన్ని కాలేజిలు, స్కూల్స్ వాటిని కూడా నిర్వ‌హించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయి ఫీజుల‌ను ముక్కుపిండి వ‌సూలు చేసిన విష‌యం చూశాం. రెండో వేవ్ క‌రోనా పూర్తిగా త‌గ్గ‌కుండానే తెలంగాణ ప్ర‌భుత్వం అడ్మిష‌న్ల‌కు అనుమ‌తులు ఇచ్చేసింది. ఇంకేముంది పోటాపోటీగా స్కూల్స్, కాలేజిలు అడ్మిష‌న్స్ రూపంలో వేల కోట్ల‌రూపాయ‌ల‌ను దండుకున్నాయి. ఇక ఇప్పుడు ఓమైక్రిన్ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి.

కాలేజిలు, స్కూల్స్ లో ఎక్కువ‌గా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త రెండు రోజులుగా అనూహ్యంగా కేసులు న‌మోదు కావ‌డంతో మ‌ళ్లీ ఆన్ లైన్ క్లాసుల దిశ‌గా తెలంగాణ విద్యాశాఖ ఆలోచిస్తోంది. అందుకు సంబంధించిన ట్ర‌య‌ల్స్ ను వేస్తోంది. కాలేజిల్లో వ‌చ్చే వారం నుంచి ఆన్ లైన్ క్లాసులు పెట్ట‌డానికి జేఎన్టీయూ ఆదేశాలు జారీ చేయ‌డానికి సిద్ధం అయింద‌ని తెలుస్తోంది.ఆస్ప‌త్రుల‌న్నింటినీ సిద్ధం చేయాల‌ని సీఎం కేసీఆర్ క్యాబినెట్ స‌మావేశంలో ఆదేశించాడు. అంటే, మ‌ళ్లీ క‌రోనా సీరియ‌స్ గా వ‌స్తుంద‌ని భావిస్తున్నాడు. ఆ మేర‌కు కేంద్రం నుంచి ప్ర‌పంచ ఆరోగ్య‌శాఖ నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా వ‌చ్చేశాయి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ఈసారైనా స‌ర్కార్ రెడీ చేయ‌డానికి సిద్ధంగా ఉందా? అంటే ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్టు క‌నిపించ‌డంలేదు.క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉంటుంద‌ని చాలా రోజులుగా నిపుణులు చెబుతున్నారు. పైగా పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా ఉంటుంద‌ని కూడాఅంచ‌నా వేశారు. అయినప్ప‌టికీ సాప్ట్ వేర్ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ను వీడాల‌ని తెలంగాణ సర్కార్ ఒత్తిడి చేసింది. ఫ‌లితంగా హైద‌రాబాద్‌కు టెక్కీలు వ‌చ్చేశారు. పిల్ల‌ల్ని భారీ ఫీజులు క‌ట్టి స్కూల్స్ లో చేర్పించారు. ప్ర‌స్తుతం క్లాసులు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో భారీ ముప్పు పొంచి ఉంద‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇంకో వైపు సాప్ట్ వేర్ కంపెనీలు త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎయిమ్స్ లాంటి ఆస్ప‌త్రులు టెలీ , వీడియో వైద్య సేవ‌ల‌ను అందించ‌డానికి సాప్ట్ వేర్ కంపెనీలు స‌హ‌కారం అందిస్తున్నాయి. మొత్తం మీద మ‌ళ్లీ విద్యా, వైద్య రంగాల దందాకు ప‌రోక్షంగా ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, సేవా రంగం ప్ర‌జా అవ‌స‌రాల‌ను క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డింది. సో..ఈసారి దందా ఏ స్థాయిలో ఉంటుందో..ఊహించుకుంటే సామాన్యుడి గుండె ధ‌డేల్ మంటోంది.