Site icon HashtagU Telugu

Kejriwal : అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఈడీ తొలి చార్జ్‌షీట్

Aam Aadmi Party PAC meeting today evening

Aam Aadmi Party PAC meeting today evening

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణాం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టుయిన కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలి ఛార్జ్‌షీట్‌ (chargesheet) రూపొందిస్తున్నట్లు సమాచారం. దీన్ని శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసులో కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ (ED) తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయనను ‘కీలక కుట్రదారు’గా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది. ఈ కేసులో డీల్లీ సీఎం (Delhi CM)కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనుంది. అదే రోజున ఆయనపై ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలుకు సిద్ధమవడం గమనార్హం.

Read Also:Terrorists Attack : గాఢ నిద్రలో ఉండగా ఏడుగురు కార్మికుల కాల్చివేత 

కాగా, కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు విధించిన కస్టడీ గడువు ముగిసిపోవడంతో మంగళవారం కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా సిబిఐ, ఇడి కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఎదుట పోలీసులు హాజరుపరచగా మే 20 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆమె ఉత్తర్వులు జారీచేశారు. ఆయనతోపాటు సహ నిందితుడు చన్‌ప్రీత్ సింగ్ జుడిషియల్ కస్టడీని కూడా మే 20 వరకు న్యాయమూర్తి పొడిగించారు.