Delhi Liquor Case: నవంబర్ 2న కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఆందోళన

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. దీంతో ఆప్ ఆందోళన చెందుతుంది. నవంబర్ 2వ తేదీన విచారణ ముగిసిన తరువాత కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఆప్ అగ్రనేతలను జైలుకి పంపించడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని ఆమ్ ఆద్మీ మండిపడింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ అయ్యాయి. నవంబర్ 2 ఉదయం 11 గంటలకు దర్యాప్తు ఏజెన్సీ ఢిల్లీ కార్యాలయంలో కేజ్రీవాల్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తుంది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ​​పంపడం ఇదే తొలిసారి . ఈ కేసులో ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయనను ప్రశ్నించింది. ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని తెలిసి ఆప్‌ని లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి వ్యూహాలను రచిస్తున్నదని అతిషి అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు, ఎంసీడీ ఎన్నికల్లో కూడా ఆప్ బీజేపీని ఓడించిందని ఆమె అన్నారు . ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో ఆప్‌ని ఓడించలేమని బీజేపీకి తెలుసని ఆమె అభిప్రాయపడ్డారు. ఆప్ నేతలకు జైలుకు వెళ్లే భయం లేదని, తమ చివరి శ్వాస వరకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటారని అతిషి పునరుద్ఘాటించారు.

Also Read: Indians: భారత్, తైవాన్ పర్యాటకులకు థాయ్ లాండ్ లో వీసా ఫ్రీ ఎంట్రీ