Site icon HashtagU Telugu

Kejriwal Vs ED : కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం.. మూడువారాల టైం కోరిన ఈడీ

CM Kejriwal orders from ED custody for the second time

CM Kejriwal orders from ED custody for the second time

Kejriwal Vs ED : ఢిల్లీ  లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించింది. దీనిపై ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. తమకు నిన్ననే(మంగళవారం) కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందన్నారు. దాన్ని స్టడీచేసి బదులిచ్చేందుకు మూడువారాల సమయం కావాలని కోర్టును కోరారు.

We’re now on WhatsApp. Click to Join

ఈడీ వాదనలపై ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు.  కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే ఈడీ మరింత టైం అడుగుతోందని ఆయన ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి సరైన ఆధారాలు ఒక్కటీ లేవని.. దీనిపై హైకోర్టు చొరవచూపి నిర్ణయం తీసుకోవాలన్నారు.  మార్చి 23నే కేజ్రీవాల్ తరఫున హైకోర్టులో పిటిషన్ వేశామని.. అప్పటి నుంచే పిటిషన్‌తో ముడిపడిన సమాచారం అందుబాటులోకి వచ్చినా, ఈడీ తరఫు న్యాయవాది అందలేదని చెబుతుండటం సరికాదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది(Kejriwal Vs ED) అన్నారు. ‘‘ఈడీ రిమాండ్‌కు అప్పగించడాన్ని సీఎం కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు.  రేపటితో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగియబోతోంది. ఆలోగా హైకోర్టు తగిన నిర్ణయం ప్రకటించాలి’’ అని ఆయన కోరారు.  దీంతో కాసేపటి తర్వాత మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తెలిపారు.

Also Read :MLC ByPoll : రేపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలుకు వెళ్ళక తప్పలేదు. నిన్న ట్రయల్ కోర్టు రిమాండ్ విధించాక ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ కవితకు ఖైదీ నంబర్ 666ను కేటాయించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఇదే జైల్లో కవిత ఉండనున్నారు. అయితే మొదటిరోజు ఆమె చాలా డల్‌గా ఉన్నారని అంటున్నరు అధికారులు. ఆమెకు ఇంటి నుంచే భోజనం, బ్లాంకెట్లు లాంటి సదుపాయాలు కల్పించారు. కానీ కవిత మాత్రం సరిగ్గా తినలేదని, నిద్రపోలేదని తెలిపారు.  జైల్లో కవితకు పుస్తకాలు, పెన్నులు లాంటి సదుపాయాలు కూడా కల్పించారు. అయితే వాటి మీద కూడా దృష్టిని పెట్టలేకపోయారని అంటున్నారు జైలు అధికారులు. పుస్తకాలు కాసేపు చదివారు కానీ మళ్ళీ వాటిని పక్కన పడేసి ఆలోచనల్లోకి వెళ్ళిపోయారని చెప్పారు. ఇక ఈరోజు ఉదయం కూడా కవిత డల్‌గా కనిపించారు. బ్రేక్ ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదని తెలిపారు. మొత్తానికి కవిత తొలిరోజు తీహార్ జైలులో అన్యమనస్కంగానే గడిపారని తెలుస్తోంది. ఆమె వద్దకు వచ్చిన జైలు సిబ్బందిని కూడా పలుకరించలేదని చెబుతున్నారు.