Site icon HashtagU Telugu

Tamil Nadu : మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు

ED searches at Minister Nehru house

ED searches at Minister Nehru house

Tamil Nadu : ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయం హీటెక్కింది. మంత్రి కేఎన్‌ నెహ్రు, ఆయన కుమారుడు, ఎంపీ అరుణ్ నెహ్రూకు సంబంధించిన ఇళ్లతో పాటు చెన్నైలోని 10 ప్రాంతాలతో పాటు అడయార్‌, తేనాంపేట, సిఐటి కాలనీ, ఎంఆర్‌సి నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో, ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు.

ఇక, వివరాలప ప్రకారం..తమిళనాడు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఇళ్లలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు (ఏప్రిల్ 7న) తెల్లవారుజామునే జాతీయ దర్యాప్తు బృందం.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్ కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్‌లో ఆర్థిక అవకతవకలకు జరిగినట్లు ఈడీ అధికారులు సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానికి సంబంధించి తనిఖీలు చేస్తుంది. టీవీహెచ్ 1997లో స్థాపించబడింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా గుర్తింపు ఉంది.

Read Also: Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం